రాష్ట్రీయం

విశాఖ ఖ్యాతి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖ ఖ్యాతి పెరగాలని, ప్రపంచపటంలో విశాఖకు సుస్థిర స్థానం లభించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 4నుంచి 8వరకూ విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు అనేకమంది వివిఐపిలు వస్తున్నందున భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రతా చర్యల్లో ఉపయోగించాలని సూచించారు. పాస్‌లు జారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐరిష్ టెక్నాలజీ ఉపయోగించి పాస్‌లు జారీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. వీటిని ముందుగానే ఊహించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వివిధ దేశాల నుంచి విశాఖ వచ్చే అతిథులను విశాఖ అందాలు ఆకట్టుకునేలా చూడాలని చంద్రబాబు కోరారు. రాష్టప్రతి, ప్రధాన మంత్రి సహా వివిఐపిలు అంతా తిరిగి వెళ్లేంతవరకూ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూకి 52 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నట్టు చెప్పారు. వివిఐపిల స్వాగతం, వారి మర్యాదల విషయంలో నేవీ తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలియచేశారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూ తిలకించేందుకు లక్షా 50 వేల మందికి పాస్‌లు జారీ చేశామని చెప్పారు. ఒకవేళ జనం అంచనాలకు మించి వస్తే, వారిని హోల్డ్ చేయడానికి మూడు ప్రాంతాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. చిన్న పొరబాటువల్ల గోదావరి పుష్కరాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫోన్ సంభాషణల్లో సిఎం బిజీ
కలెక్టరేట్‌లో సమీక్ష జరుగుతున్నప్పుడు సిఎం చంద్రబాబుకు పదేపదే ఫోన్‌లు వచ్చాయి. ఆయన ఫోన్‌లో మాట్లాడేందుకు మూడుసార్లు సమావేశం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

చిత్రం... ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్లపై శనివారం రాత్రి విశాఖలో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు