రాష్ట్రీయం

నేర రహిత సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో అనురాగ్ శర్మ నుంచి చార్జి తీసుకున్న అనంతరం ఆయన విలేఖకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర పోలీస్ శాఖ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. శాంతి భద్రతలు, నేర నివారణ, మహిళల భద్రత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నేర రహిత సమాజంకోసం కృషి చేస్తానని, పోలీస్ శాఖలోని హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు నేర రహిత సమాజం లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఇప్పటికే పలు సంస్కరణల అమలులో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని, అటువంటి పోలీస్ శాఖకు తాను డీజీపీగా నియామకం కావడం గర్వంగా ఉందని మహేందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయని, ఆధునిక టెక్నాలజీతో సైబర్ నేరాలు అదుపు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 10లక్షల సిసికెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచి ఫలితాలిచ్చిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత పటిష్ఠం చేస్తామని, శాంతిభద్రతలు, మహిళల భద్రతపై రాజీలేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా, టెర్రరిజం, సైబర్ నేరాలు, నక్సల్స్ కార్యకలాపాలు, సంఘ విద్రోహశక్తుల చర్యలను తిప్పికొడతామని మహేందర్‌రెడ్డి వక్కాణించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, అదనపు డీజీలు, ఐజీలతోపాటు పలువురు ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేందర్ రెడ్డి