రాష్ట్రీయం

కాంగ్రెస్‌లో కదనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: గుజరాత్ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణపై దృష్టి సారించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అయితే గుజరాత్ ఎన్నికల కారణంగా కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిసింది. కాగా అప్పటి వరకు తెలంగాణలో పార్టీ పరిస్థితి? నేతల పనితీరు? పార్టీ కార్యక్రమాలు? ప్రజలతో మమేకమయ్యే విధానం? సమస్యలపై ఉద్యమించడంలో శ్రేణులు ఉత్సాహం? ప్రత్యర్థుల బలాబలాలు? కలిసి పోటీచేసే పార్టీలు ఏమిటి? కొత్త పార్టీల ఆవిర్భావం, వాటిపట్ల ప్రజలకు విశ్వాసం..? తదితర అంశాలను పరిశీలించి నివేదికలు ఇవ్వాలంటూ రాహుల్ నాలుగు ప్రత్యేక బృందాలను తెలంగాణకు పంపినట్టు సమాచారం. నెలరోజుల్లోనే ఈ బృందాలు నివేదిక సమర్పిస్తాయని అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగించుకుని, తెలంగాణపై నివేదికలను రాహుల్ అధ్యయనం చేసి ఆ తరువాతే హైదరాబాద్ పర్యటనకు వస్తారని పార్టీ సీనియర్లు అంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు రాహుల్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చనున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీ ఇంకా బలపడాలంటే మెదక్ నుంచి ప్రియాంకను పోటీ చేయించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. లోగడ ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతిని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రియాంక పోటీ చేయడంవల్ల ఇంకా పార్టీలో జోష్ పెరుగుతుందన్న భావనా ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర కాలం ఉన్నప్పటికీ పార్టీశ్రేణుల్లో కదనోత్సాహం కనిపిస్తున్నదని ఏఐసీసీ గమనించింది. పార్టీకి మంచి భవిష్యత్ ఉందన్న నమ్మకం కూడా వారికి కలుగుతున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా ఇటీవల ఏఐసీసీకి నివేదించినట్టు సమాచారం. తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకురావడం, సినీ నటి విజయశాంతి మళ్లీ చురుగ్గా రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం, ఎన్నికలకు ముందు తెరాస చేసిన వాగ్దానాలు విస్మరించటం, సిఎం కెసిఆర్ నిజాం పాలనను కొనియాడటం, మైనారిటీల రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతామన్న తెరాస హామీలను వ్యతిరేకిస్తున్న వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా సిఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణపై దృష్టి పెడుతున్నట్టు సీనియర్లు చెబుతున్నారు.