రాష్ట్రీయం

‘హబ్బో’ అనిపించేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి రంగం తెలంగాణ జిల్లా కేంద్రాలకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ హైటెక్ సిటీలో కేంద్రీకృతమైవున్న ఐటీ కంపెనీలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా కేంద్రాల్లోకూ విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ అంటే మాదాపూర్, మణికొండ, గచ్ఛిబౌలి కలయికతోవున్న సైబరాబాద్ గుర్తుకొస్తుంది. ప్రతి జిల్లా శివార్లకు ఒక సైబరాబాద్ వచ్చేలా కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టూ టైర్ సిటీల్లో ఐటీ కంపెనీలను నెలకొల్పాలని మంత్రి కె తారకరామారవు గత మూడేళ్లుగా చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాదాపు60కి పైగా ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్తలు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో రూ.25 కోట్ల చొప్పున ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పారిశ్రామిక, ఐటీ సమ్మిళిత పార్కులు ఏర్పాటుచేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నామని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఐటీ హబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఐటీ హబ్‌కు డిజైన్ ఖరారైంది. ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటుకు 14మంది పారిశ్రామికవేత్తలు పోటీపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలు ఇస్తోంది. 25వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించి, 2వేల మందికి ఉద్యోగం కల్పిస్తే రూ.25 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఐటీ హబ్‌లలో ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను నెలకొల్పి వీటిని టి-హబ్‌తో అనుసంధానిస్తారు.
హైదరాబాద్ హెటెక్ సిటీలో ప్రస్తుతం 1400కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 3.5 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణమైంది. హైదరాబాద్ పరిసరాల్లో ఐదారు జిల్లాలను కలుపుతూ 290 కి.మీమేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండిఏ ప్రణాళిక ఖరారు చేసింది. తెలంగాణ నైసర్గిక, భౌగోళిక స్వరూపం దృష్ట్యా హైదరాబాద్‌కు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి మూడు గంటల్లో చేరుకునే సదుపాయం ఉంది. అందుకే వ్యయ నియంత్రణలో భాగంగా ఐటి కంపెనీలు వౌలిక సదుపాయాలు కల్పిస్తే జిల్లా కేంద్రాల్లో సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఐఐ తెలంగాణ అధ్యక్షుడు రాజన్న స్పష్టం చేశారు.