రాష్ట్రీయం

బిఆర్‌ఎస్‌కు నేడూ దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: భవనాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువు ఆదివారం ముగియనుండటతో ఆదివారం సెలవు దినం అయినప్పటికీ దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించినట్టు హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు అనుమతిలేని లే అవుట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 31 వరకు గడువు విధించగా, అది ఆదివారంతో తీరిపోనుంది. అయితే ఆదివారం సెలవు దినం అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించినట్టు హెచ్‌ఎండిఎ పేర్కొంది.

ప్రతి బాలికకు విశిష్ట గుర్తింపుకోడ్
ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి
రెండు రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: బాలికల భద్రత, సంరక్షణ, సంక్షేమం నిమిత్తం ప్రతి బాలికకు విశిష్ట గుర్తింపు కోడ్‌ను ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు శనివారం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌బి భట్ వెలువరించారు. తల్లితండ్రుల వేధింపులకు గురైన 19 సంవత్సరాల ప్రత్యూష కేసును హైకోర్టు విచారించింది. ఒక బాలిక జన్మించిన తర్వాత తాము పేర్కొన్నట్లుగా విశిష్ట గుర్తింపు కోడ్‌ను ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వం బాలికల సంరక్షణను పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ విశిష్ట గుర్తింపు కోడ్ ద్వారా ఒక బాలికకు 15- 16 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె బాగోగులను ట్రాక్ చేయవచ్చని పేర్కొంది. గ్రామ స్థాయి నుంచి ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. మల్కాజిగిరి తహసీల్దార్ వెంటనే ప్రత్యూష సంక్షేమాన్ని, భద్రతను పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఏపి అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ జోక్యం చేసుకుని ఇప్పటికే బాలికల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పగా, ఇవన్నీ సరిగా అమలు కావడం లేదని హైకోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేశారు.
ఎపి ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎన్. రమేష్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యకార్యదర్శిగా రమేష్‌కుమార్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఐదేళ్లపాటు ఎన్నికల కమిషనర్‌గా ఆయన కొనసాగుతారు.