రాష్ట్రీయం

రూ. 18 కోట్లతో మహామణి మండపం నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జనవరి 30 : తిరుమలలోని నారాయణ గిరి ఉద్యానవనంలో 40 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్లతో మణి మండపం నిర్మాణం చేపడుతున్నామని ఇందుకు సంబంధించిన నమూనాను కూడా బోర్డు సమావేశంలో ఆమోదించామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ ధర పెంచడం లేదని, ఆర్జిత సేవలు, విఐపి టిక్కెట్ల ధర పెంపుపై ఉప సంఘం ఇచ్చిన నివేదికపై నిర్ణయాన్ని వాయిదా వేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం 4.90 కోట్ల రూపాయలతో వసతి సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో వీరభద్రస్వామి ఆలయ పునరుద్ధరణకు 22.50 లక్షల రూపాయల నిధులను కేటాయించామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి, అన్నదానానికి, ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన నిత్యావసరాల కొనుగోలుకు ఏడాదికి 250 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి బంగారు తాపడం చేయడం కోసం 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. రెండవ ఘాట్ రోడ్డు మరమ్మతులకు 3.30 కోట్లు, పాపవినాశనం టోల్ గేటు వద్ద ఆక్టోపస్ బలగాలకు 4.5 కోట్లతో భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నామన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిటిడి కి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కష్ట సాధ్యం అవుతుండడంతో వేలం ద్వారా వాటిని విక్రయించాలని నిర్ణయించామన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిపే వైభవోత్సవాలను 5 రోజులకు కుదించామన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ వైభవోత్సవాలను నిర్వహించనున్నామన్నారు.
వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
కాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వా మికి 2016-17 వార్షిక సంవత్సరానికి 2678 కోట్ల రూపాయల మేర అంచనా బడ్జెట్‌ను టిటిడి ధర్మకర్త మండలి ఆమోదించినట్లు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వివరించారు. 2015- 16 సంవత్సరానికి గాను 2530.10 అంచనా బడ్జెట్‌ను రూపొందించామని, అయితే 2621.49 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించిందన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదికి 2678 కోట్ల రూపాయల అంచనా బడ్టెట్‌ను రూ పొందించామన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 7 నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనున్న వైభవోత్సవ గోడ పత్రికను టిటిడి చైర్మన్, ఈవో డి సాంబశివరావు, జెఈవోలు శ్రీనివాస రాజు, పోలా భాస్కర్‌లు ఆవిష్కరించారు.

శ్రీవారి హుండీలో బంగారు ఫుట్‌బాల్

మొక్కు తీర్చుకున్న మహారాష్ట్ర అజ్ఞాత భక్తుడు

తిరుమల, జనవరి 30 : ఫుట్ బాల్ క్రీడ అంటే ఎంత ఇష్టమో, ఆ ఆటలో గెలవాలని మొక్కుకున్నారో ఏమో తెలియదు కానీ, మహారాష్టక్రు చెందిన ఓ అజ్ఞాతభక్తుడు రెండున్నర కిలోల బరువు కలిగి వజ్రాలు పొదిగిన బంగారు ఫుట్‌బాల్‌ను శ్రీవారి హుండీలో కానుకగా సమర్పించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గురువారం ఆ భక్తుడు హుండీలో బంగారు ఫుట్‌బాల్‌ను వేసి వుంటాడని ఆలయ అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇటీవల ఫుట్‌బాల్ క్రీడకు భారతదేశంలో కూడా మోజు పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర కేంద్రంగా ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్‌లు పుణె, ముంబయి జట్లకు యజమానులుగా ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే ఈ బంగారు బాల్‌ను ఈ రెండు జట్లలోని ఎవరైనా వేయించారా లేక ఎవరైనా ఫుట్ బాల్ క్రీడా ప్రియుడు వేసాడా అన్నది రహస్యంగా మిగిలింది.
ఇదిలా ఉండగా ఒక్క గురువారం రోజే 14 కేజీల 356 గ్రాముల బంగారు, వజ్రాలు కలిగిన ఆభరణాలను పలువురు భక్తులు హుండీలో సమర్పించినట్లు టిటిడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో బంగారు ఫుట్‌బాల్ 2.385 కిలోలు ఇందులో 0.07 సెంట్స్ కలిగిన వజ్రాలు పొదిగి ఉన్నాయి. మార్కెట్ ధర ప్రకారం 64 లక్షల 39 వేల 500 రూపాయలు ఉంటుందని అంచనా. 317.94 గ్రాముల బరువు కలిగిన 10 బంగారు వాచ్‌లు, 6 కిలోల 711 గ్రాముల బంగారు ఆభరణాలు హుం డీలో సమర్పించారు. కాగా 44.53 గ్రాములు బరువు కలిగిన 12 పురాతన నాణేలు ఉన్నాయి. ఒక కేజి 801 గ్రాముల బరువుకలిగిన 214 చిన్నపా టి వజ్రాభరణాలున్నాయి. 711 గ్రా ముల బరువు కలిగిన సాధారణ బంగారు ఆభరణాలు, 577 గ్రాముల పగడాల ఆభరణాలు హుండీలో పడ్డాయి. ఒక్క రోజే 7 కోట్ల రూపాయల మేర విలువ కలిగిన బంగారు, వజ్రాభరణాలు హుండీలో పడడం విశేషం.