రాష్ట్రీయం

రక్తమోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రహదారులు రక్తమోడాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో సంభవించిన ఘోర ప్రమాదాల్లో 10మంది మృత్యువాతపడ్డారు. కనీసం 20మంది తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

నెత్తురోడిన సుచిత్రా రోడ్డు
డివైడర్‌ను ఢీకొన్న పల్సర్ వాహనంఖముగ్గురి మృతి
జీడిమెట్ల, నవంబర్ 17: అతివేగం ముగ్గురు యువకుల మరణానికి కారణమైంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాగర్ గౌడ్ కుమారుడు అనిల్‌కుమార్(22) హోటల్ మేనేజ్‌మెంట్ విద్యను మధ్యలో వదిలేశాడు.
ఆర్మూర్‌కు చెందిన రమేశ్ కుమారుడు రతన్ ఆంగే (22).. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రతన్ ఆంగే, అనిల్ కుమార్.. అల్వాల్‌లో ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా యంక్‌పేట్‌కు చెందిన అనంతరాజు కుమారుడు ఆమన్‌రాజు (22) గురువారం అల్వాల్‌లోని అనిల్ కుమార్, రతన్ ఆంగే వద్దకు వచ్చారు. గురువారం అర్థరాత్రి ముగ్గురు పల్సర్ వాహనంపై అల్వాల్ నుండి బోయిన్‌పల్లికి వెళ్తున్నారు. అతివేగంగా దూసుకెళ్తుండగా సుచిత్రా చౌరస్తాలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో అనిల్‌కుమార్, రతన్ ఆంగే, ఆమన్‌రాజు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న బాలానగర్ జోన్ డీసీపీ సాయిశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలను తెలుసుకున్నారు. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాల లారీ, ఆటో ఢీ
ఖఆరుగురి దుర్మరణంఖమృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు
*10మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపుఖపరిమితికి మించి
కూలీలతో వెళ్తున్న ఆటోఖఅన్ని విధాల ఆదుకుంటాం : మంత్రి ఈటల

కరీంనగర్, నవంబర్ 17: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పత్తి ఏరేందుకు మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురై ఆటో డ్రైవర్‌సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో పది మంది మహిళలు క్షతగాత్రులయ్యారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు. ఈ హృదాయ విదారక ఘటన శుక్రవారం ఉదయం సుమారు 8గంటల సమయంలో చోటుచేసుకుంది. కరీంనగర్ శివారు కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని కాకతీయ కాలువ వద్ద పాల లారీ, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో కరీంనగర్ మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఒన్నం మాధవరావు (50), మేకల దేవమ్మ (55), మేకల లలిత (45) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నెరేళ్ల సాయిలీల (19) అనే యువతి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కూనరాజు ఓదమ్మ (38), నాంపల్లి అంజలి అలియాస్ లావణ్య (25) మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం...చామన్‌పల్లి గ్రామానికి చెందిన 15 మంది నిరుపేద వ్యవసాయ మహిళా కూలీలు ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామంలో పత్తి ఏరడానికి గ్రామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి ఆటోలో ఉదయం గ్రామం నుంచి బయలుదేరారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని కాకతీయ కాలువ వద్దకు రాగానే పాల లారీ, ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ మాధవరావు, మేకల దేవమ్మ, మేకల లలిత అక్కడికక్కడే, మేకల సాయిలీల మార్గమధ్యంలో మృతి చెందారు. గాయపడిన 12మందిని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూనరాజు ఓదమ్మ, నాంపెల్లి అంజలి అలియాస్ లావణ్య మృతి చెందారు. మిగిలిన 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో విలాసాగర్ మాధవి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సమాచారం అందుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి, రూరల్ ఏసీపీ ఉషారాణి, సీఐ శశిధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరా మర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం విన్న చామన్‌పల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుల బంధువులు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆసుపత్రి ఆవరణంతా దద్దరిల్లింది. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ బిజెపి, వైకాపా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి మంచిర్యాల చౌరస్తాలో ధర్నా చేపట్టారు. దీంతో ఆ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. కరీంనగర్ ఆర్డీఓ రాజాగౌడ్ చేరుకుని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.3.50లక్షలు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, డబుల్‌బెడ్రూం ఇళ్లను కూడా కట్టిస్తామని కమలాకర్ తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి తెలిపారు.

చిత్రం..కరీంనగర్‌లో పాలవ్యాను ఢీకొన్న ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో