రాష్ట్రీయం

మాట్లాడేదే ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: మాట్లాడేది ఆచరించగలిగే నేతలు దేశానికి చాలా అవసరమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నూతన మార్గాల్లో పయనించే ధైర్యం ఉండాలని, స్పష్టమైన ముందుచూపుతోనే ఎవరైనా విజయాలు సాధించగలుగుతారని అన్నారు. గీతం వర్శిటీ 8వ స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శ పౌరులుగా ఎదగాలని, మంచి ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. కష్టపడి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని, తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకూడదన్నారు. మంచి కలలు కని, వాటిని సాకారం చేసుకోవడానికి కృషిచేయాలని, లేకపోతే నష్టపోతామని వెంకయ్య హెచ్చరించారు. ప్రతి ఒకరూ తమ కోసం, కుటుంబం కోసం, దేశం కోసం, సమాజ ఔన్నత్యం కోసం కృషి చేయాలని సూచించారు. కన్నతల్లిని, మాతృభాషను మరచిన వాడు మనిషే కాడని, అమ్మ అనే మాట అంతరాళం నుంచి వస్తుందన్నారు. మాతృభాష కళ్ల వంటిదని, ఆంగ్లం కళ్లజోడు వంటిదని అంటూ, కళ్లే లేకపోతే కళ్లజోడుతో పనేమిటని చమత్కరించారు. మాతృభాషలో మాట్లాడటం ఓ ఉద్యమం కావాలని ఆయన అభిలషించారు.
గీతం వర్శిటీలో చేరితే విద్యార్ధుల గీత, రాత మారతాయని కితాబునిచ్చారు. ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని విలువలను అమలుచేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సొంత కాళ్లపై నిలబడాలని, తమలో ఉన్న నైపుణ్యాలతో ఎదిగేందుకు కృషి చేయాలని పట్ట్భద్రులకు సూచించారు. ప్రపంచంలో ఎక్కడ తెలివి ఉన్నా తెలుసుకోవాలని, ఉన్నత విద్యకోసం విదేశాలు వెళ్లినా కొంత సంపాదించాక తిరిగి మాతృదేశానికి వచ్చి తమకున్న దానిని ఇతరులతో పంచుకుని ఆనందం పొందాలని సూచించారు. మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను గుర్తుంచుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో ఇద్దరికి పిహెచ్‌డి, 1057 మంది సాంకేతిక, మేనేజిమెంట్ విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. సాంకేతిక, మేనేజిమెంట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన
12మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు.
అఖిల భారత సర్వీసుపై దృష్టిపెట్టాలి
అఖిల భారత సర్వీసులపై తెలుగువారు దృష్టిపెట్టాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు సూచించారు. ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యవస్థాపకులుగా యువత ఎదిగి పరిశ్రమలను స్ధాపించి, పదిమందికీ ఉపాధి కల్పించాలన్నారు. రాజకీయ లబ్ది ఆశించే ప్రభుత్వాల మాదిరి కాకుండా అంశాల వారీ కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తూ మారుమూల పల్లెలలకు కూడా స్వచ్ఛ తాగునీరు, మిగులు విద్యుత్, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, 46 వేల చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
భారతీయ సంప్రదాయం, వివిధ మతాల ఆధ్యాత్మిక సంప్రదాయంలో శాంతి అంతర్లీనంగా ఉంటుందని వర్శిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామకృష్ణారావు అన్నారు. వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచశ్రేణి వర్శిటీల్లో ఒకటిగా గీతం వర్శిటీని నిలపాలనే లక్ష్యం తాము నిర్దేశించుకున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ఎస్ ప్రసాదరావు తమ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గీతం వర్శిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎస్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం గంగాధరరావు, పాలక మండలి సభ్యులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
ఉప రాష్టప్రతికి ఘన స్వాగతం
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్ శనివారం ఘనస్వాగతం పలికారు. సోమవారం వరకూ ఆయన నగరంలో ఉంటారు. స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ పి సింగ్, ఎం మహేందర్‌రెడ్డి, జిఎడి ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, రాజ్‌భవన్ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఇంచార్జి పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు, కలెక్టర్ యోగితా రాణా తదితరులున్నారు.

చిత్రం..శనివారం సంగారెడ్డిజిల్లాలోని గీతం వర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు