రాష్ట్రీయం

కల్పవృక్ష, హనుమంత వాహనాలపై బ్రహ్మాండ నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 18: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపైన, రాత్రి హనుమంత వాహనంపై శ్రీపతి హృదయేశ్వరి, బ్రహ్మాండ నాయకి విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సర్వాలంకార భూషితురాలైన అమ్మవారు వేణుగోపాల స్వామి అవతారంలో ఊరేగుతూ కల్పవృక్ష వాహనంపై ఊరేగుతుండగా వాహనం ముందు భాగాన అశ్వాలు, వృషభాలు, గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే చతుర్మాడ వీధులు అమ్మవారి నామసంకీర్తనలతో మార్మోగాయి.
వైభవంగా హనుమంత వాహన సేవ
అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిలక్ష్మి అలమేలుమంగమ్మ సీతాదేవిగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. ఆ సీతామాతే కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్లుగా అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాల్లో హనుమంతున్ని వాహనంగా చేసుకుందని పురాణ పండితులు వెల్లడిస్తున్నారు. కాగా మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.