రాష్ట్రీయం

ఇవాంక టూర్..నగరమంతా అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరమంతా అలర్ట్ అయింది. పాతబస్తీ మ్తొం పోలీసుల అదుపులోకి వెళ్లింది. దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోదీ, ఇవాంక డిన్నర్ ఉన్నందున ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత చేపట్టారు. ఇవాంక చార్మినార్, లాడ్ బజార్, చౌముహల్లా ప్యాలెస్‌ను సందర్శించనున్నందున ఆ ప్రాంతమంతా ప్రత్యేక పోలీస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫఓర్స్, యూఎస్ సెక్యూరిటీ సర్వీసెస్, ఆక్టోపస్ కమాండోస్, గ్రేహౌండ్స్ సిబ్బంది పాత బస్తీని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సౌత్‌జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. ఫలక్‌నుమా సమీపంలోని ఫాతిమా నగర్, ఫరూఖీ నగర్‌ర, ఆల్-జుబేల్ కాలనీల్లో ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నట్టు డీసీపీ పేర్కొన్నారు. వాహన తనిఖీలతోపాటు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, రౌడీ షీటర్లు, పాత నేరస్థులను ఇప్పటికే బైండోవర్ చేశామని డీసీపీ వివరించారు.