తెలంగాణ

వరంగల్ జిల్లాలో మావోల డంప్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు టౌన్, నవంబర్ 27: వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పరిధిలోని ప్రాజెక్ట్‌నగర్ గ్రామ శివారులో దర్వాజగుట్ట వద్ద ఒర్రెలో శుక్రవారం డిఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ ములుగు డిఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో ములుగు, ఏటూరునాగారం సిఐలు శ్రీనివాసరావు, కిషోర్‌కుమార్, పస్రా ఎస్సై యాసీన్‌లు సంఘటన స్థలానికి చేరుకొని చెట్టు తొర్రలో ఉన్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌ను పరిశీలించగా అందులో రెండు 303 తుపాకులు, మూడు రైఫిర్ మార్‌లు, 61 రౌండ్లు, ఒకటి ఫైర్డ్ రౌండ్, రెండు మ్యాగజైన్‌లు, 104 బులెట్లు, రెండు నోకియా బ్యాటరీలు, కంపాస్, బెల్టు పౌచ్‌లు ఇతర సామాగ్రి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ డంపు ఎవరిది అనే కోణంలో విచారణ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, డంప్‌లో దొరికిన తుపాకులు, బుల్లెట్లు పోలీసులవేనని అవి ఏ స్టేషన్‌వి అక్కడికి ఎలా వచ్చాయి విచారణలో తేలాక వివరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా డంప్‌ను ఛేదించిన డిఎస్పీ, పస్రా ఎస్సైలను అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ రాజమహేంద్రనాయక్, సిఐలు శ్రీనివాసరావు, కిషోర్ కుమార్, సిఆర్‌పిఎఫ్ సిఐ, పస్రా ఎస్సైలు పాల్గొన్నారు.