రాష్ట్రీయం

మహిళలూ బహుపరాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: వివాహిత మహిళలు, యువతుల అమాయకత్వం వారి మాన ప్రాణాలపైకి వస్తోంది. అయిన వాళ్లంటూ చేరదీసి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. నమ్ముకొని ఆశ్రయిస్తే.. అయినవాళ్లే కాటేస్తున్నారు.. రేపిస్టులంతా తెలిసినవారే కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. మహిళలు తెలిసిన వాళ్లని, కుటుంబ మిత్రులని, స్నేహంగా ఉన్నారని చనువిచ్చారో..లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురికాక తప్పడం లేదు. కాబట్టి మహిళలూ ఎంతో జాగరూకతతో మెదలండి. మగాళ్ల క్రూరత్వానికి బలికావద్దు..అప్రమత్తతతో ఉండాలని ఎన్‌సీఆర్‌బీ సూచిస్తోంది. 2016లో మహిళలపై జరిగిన అత్యాచారాలపై జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక వివరాలిలావున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాల్లో 4882 కేసులతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 4816 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 994 అత్యాచారం కేసుల్లో 994 కేసులు తెలిసినావారే
రేప్ చేశారు. ఆరు కేసుల్లో తాత లేదా తండ్రి లేదా సోదరుడు లేదా కుమారుడు, 29 కేసుల్లో కుటుంబ సభ్యులు, 44 కేసుల్లో బంధువులు, 361 కేసుల్లో ఇరుగుపొరుగువారు ఉన్నారు. తెలంగాణలో 1278 అత్యాచార కేసులకు 1254 కేసుల్లో తెలిసిన వారే అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఎన్‌సిఆర్‌బి ప్రకటించింది. ఇందులో 1 కేసుల్లో రక్తసంబంధీకులు, 127 కేసుల్లో కుటుంబ సభ్యులు, 155 కేసుల్లో బంధువులు, 355 కేసుల్లో ఇరుగుపొరుగువారు మహిళలపై అత్యాచారం చేశారు. మహరాష్టల్రో 4189 కేసులు నమోదు కాగా, మిజోరంలో అతితక్కువ 23 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం నమోదైన 4882 అత్యాచార కేసుల్లో 4789 మందిపై అత్యాచారానికి పాల్పడింది తెలిసిన వారే. కాగా, 35 మంది మహిళలు తాత, తండ్రి, సోదరుడు, కొడుకు చేతుల్లో అత్యాచారానికి గురైన వారున్నారు. 108 మంది సమీప బంధువులచే అత్యాచారానికి గురవ్వగా, 157 మంది మహిళలు బంధువులు, మరో 1115 మంది మహిళలు ఇతరులచే అత్యాచారానికి గురైన వారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో నమోదైన 4816 అత్యాచార కేసుల్లో 4803 మంది మహిళలు తెలిసిన వారితో, 27 మంది మహిళలు తాత, తండ్రి, సోదరుడు, కొడుకులచే అత్యాచారానికి గురయ్యారు. 154 మంది మహిళలు కుటుంబ సభ్యుల చేతిలో మోసపోగా, 441 మంది మహిళలు సమీప బంధువులు, మరో 1851 మంది మహిళలు ఇతరులచే చెరచబడ్డారు. అత్యాచార బాధితుల్లో 4189 మంది మహిళలు మహరాష్టల్రో ఉండగా, వీరిలో 4126 మంది తెలిసిన వారి చేతుల్లో, 96 మంది మహిళలు తాత,తండ్రి, సోదరుడు, కొడుకుచే అత్యాచారానికి గురికాగా, 151 మంది సమీప బంధువులు, 683 మంది మహిళలు ఇతరుల చేతిలో అత్యాచారానికి గురయ్యారు. రాజస్థాన్‌లో 3656 మంది మహిళలు అత్యాచారానికి గురికాగా, 3626 మంది మహిళలపై తెలిసిని వారు అత్యాచారానికి పాల్పడ్డారు. 147 మంది మహిళలు తాత, తండ్రి, సోదరుడు, కొడుకుచే అత్యాచారానికి గురికాగా, 139 మంది మహిళలపై కుటుంబ సభ్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. 269 మంది మహిళలు సమీప బంధువులు, 704 మంది మహిళలు కామాంధులచే అత్యాచారానికి గురయ్యారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతమైన లక్ష్యద్వీప్‌లో కేవలం ఐదుగురు మహిళలు తెలిసిన వారి చేతుల్లోనే అత్యాచారానికి గురై దేశంలో అతితక్కువ కేసులతో మంచి రాష్ట్రంగా నిలిచింది.