రాష్ట్రీయం

ఉరేసుకున్న నిరుద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూలోని మానేరు హాస్టల్‌లో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి మురళి ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌కు చెందిన మురళి మానేరు హాస్టల్ రూమ్ నెం.159లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే నిరుద్యోగం కారణంగానే మురళి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుండగా, సూసైడ్ నోట్‌లో మాత్రం ‘ఈ చదువు నావల్ల కావట్లేదు.. నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ రాసి ఉంది. విద్యార్థి ఆత్మహత్య సంఘటన ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఓయూ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే మురళి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇందుకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పోలీసులు భారీగా మోహరించి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎస్‌ఎస్ రాజు నేతృత్వంలో ఓయూలో గట్టి బందోబస్తు చేపట్టారు. ఎన్‌ఓసి గేటు మూసేసి నిషేధాజ్ఞలు విధించారు.
ఇలావుండగా ఓయూలో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీస్ కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. ఓయూలో ఎమ్మెస్సీ చదువుతున్న మురళీ చదువు ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని కమిషనర్ వివరించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి వెళ్లిందని, ఈస్ట్‌జోన్ డీసీపీ, ఇతర సిబ్బంది ఓయూలోనే ఉన్నారని పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. మురళి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని, విద్యార్థి మృతిపై రాజకీయం చేయొద్దని శ్రీనివాసరావు సూచించారు.

చిత్రాలు....ఆత్మహత్యకు పాల్పడిన మురళి
*మురళి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే మానేరు హాస్టల్‌కు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులు