రాష్ట్రీయం

ఎవరి దారి వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాలను వచ్చే వేసవి వరకు పొదుపుగా ఉపయోగించుకోవాలన్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాను బేఖాతరు చేస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ ఆంధ్ర, పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మళ్లిస్తోందని ఆంధ్ర రాష్ట్రంపైన తెలంగాణ రాష్ట్రం పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ హౌస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రోజుకు ఐదు ఎంయు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు, అదే సమయంలో ఆంధ్రప్రభుత్వం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై కృష్ణాబోర్డు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. గత వారమే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ రెండు రాష్ట్రాలు ఈ ఏడాది నీటి వినియోగ ప్రణాళిక, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలని, నీటిని దుబారా చేయరాదని సూచిస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 157 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 239 టిఎంసి నీటి లభ్యత ఉంది.
ఈ నీటిని వచ్చే వేసవి వరకు రెండు రాష్ట్రాలు మంచినీటి అవసరాలకు, ప్రస్తుత రబీ సీజన్‌కు వాడుకోవాల్సి ఉంటుంది. కాని రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించడంతో ఎవరికి తోచినట్లు వారు నీటిని వాడుకోవడం వల్ల వచ్చే మార్చి నుంచి నాలుగైదు నెలల పాటు కృష్ణా నదిపై ఆధారపడిన జిల్లాల ప్రజలు మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్ధితి తలెత్తుతుందని సాగునీటి నిపుణులంటున్నారు. కాగా శ్రీశైలం నుంచి దిగువకు వదిలిన నీటిలో 44 టిఎంసి నీరు తక్కువగా ఉందని, ఈ నీటిని ఆంధ్ర మళ్లించిందని కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. 44 టిఎంసి నీటిపై సాగునీటి నిపుణులు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణాబోర్డు కమిటీని ఏర్పాటు చేసింది.