రాష్ట్రీయం

ధార్మిక కార్యక్రమాల్లో అదనపు లడ్డూ ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 3: తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో టీటీడీ సాధారణ ధరకు విక్రయిస్తున్న లడ్డూలు అదనంగా కావాలని నిర్వాహకులు భావిస్తే, అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ టీటీడీ ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీనివాసం కల్యాణం వంటి ధార్మిక కార్యక్రమాలకు పెద్ద లడ్డూలను ఒక్కొక్కటి రూ. 100 చొప్పున 10 లడ్డూలు, చిన్న లడ్డూలు రూ.25 చొప్పున 200, వడలు రూ.25 చొప్పున 10, మినీ లడ్డూలు రూ.3.50 పైసలు చొప్పున వెయ్యి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారని, ఈనేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుల నుంచి అదనపు లడ్డూలు సరఫరా చేయాలని వినతులు అందుతున్నాయన్నారు. ఈక్రమంలో అదనపు లడ్డూల ధరలను పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా పెద్ద లడ్డూ ధరను ఒకటి రూ. 200లకు, చిన్నలడ్డూ రూ.50కి, వడ రూ. 100గా, మినీ లడ్డూ రూ.7గా అదనంగా చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు అసలు ధరకే లడ్డూలు విక్రయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.