రాష్ట్రీయం

అదిరిందయ్యా చంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: సీఎం చంద్రబాబు తొలిరోజు దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. కొరియా పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక బృందంతో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ తీసుకుంది. ఒప్పందాల విలువ అక్షరాలా రూ. 3వేల కోట్లగా అంచనా. ఈ సంస్థల ద్వారా మొత్తం 7,171 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సోమవారం కియా మోటార్స్ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలకు మద్దతు పలికారు. మరోవైపు కియా అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ. 4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
నీటి శుద్ధిపరిశ్రమలపై హేనోల్స్ కెమికల్స్ ఆసక్తి
చంద్రబాబుతో హేనోల్స్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్ట్ఫోని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్ సమావేశమయ్యారు. భారత్ ఇప్పుడు శక్తిసామర్థ్యాలున్న తయారీ కేంద్రంగా రూపొందిందని, భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబుతో స్ట్ఫోని చెప్పారు. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్ ఫోన్‌లో వాడే పెయింట్‌ను తయారు చేస్తామని స్ట్ఫోని వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సూచించారు. అనంతరం గ్రాన్ సియోల్ (జీఎస్) ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు టెజిన్ కిమ్, హూన్ హోంగ్ హూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్‌లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే స్టేడియాల నిర్మాణాల్లో అనుభవమున్న జీఎస్ కంపెనీని, అమరావతి క్రీడానగరంలో పాలుపంచుకోవచ్చని బాబు సూచించారు. బీటీఎన్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్‌తో బాబు సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ, సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. దక్షిణ కొరియా -ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ఓప్పందంలో భాగంగా ఆ సిటీ ఏర్పాటు కానుంది. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు తగు ప్రతిపాదనలు అందించాలని చంద్రబాబు సూచించారు. అనంతరం సీఎంతో పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జుసీబో సమావేశమయ్యారు. భారత్‌లో ఎల్‌ఎన్‌జీ వాల్వ్ చెయిన్ బిజినెస్‌పై పోస్కో ఆసక్తి ప్రదర్శించింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలతోపాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కోకు అనుభవముంది. డౌన్ స్ట్రీమ్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రీపై సంస్థ ఆసక్తి చూపగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోని పెట్రో కారిడార్‌లో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని సీఎం వివరించారు. అనంతరం హ్యూసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జుంగ్‌లీతో సీఎం భేటీ అయ్యారు. టెక్స్‌టైల్స్, గార్మెంట్ పరిశ్రమలపై ఆసక్తిగా ఉన్నామని, భారత్‌లో
తమ యూనిట్లు పెట్టేందుకు తగిన ప్రదేశం కోసం అనే్వషిస్తున్నామని హ్యూసింగ్, చంద్రబాబుకు తెలిపారు. ఏ రాష్ట్రం ఇవ్వలేనంత ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఇస్తామని, ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భౌగోళిక సానుకూల అంశాలు అనేకం ఏపీలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమల, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్, ఏసీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.

చిత్రం..లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓ వాన్గ్ కాగ్‌జుతో సీఎం చంద్రబాబు బృందం