రాష్ట్రీయం

ఏపీకి కేంద్రం ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబబర్ 4: కేంద్ర నిధులకు రాష్ట్రంలో తాత్కాలిక బ్రేకు పడింది. ఇకపై పనులు చేపట్టాలంటే తాజా మార్గదర్శకాలతో చేపడితేనే తదుపరి నిధులు వస్తాయని షరతులతో కూడిన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర నిధులతో చేపట్టే పనుల్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేకుండా రాష్టమ్రే నిర్వహిస్తుందనే విధంగా ప్రచారం జరుగుతున్నట్టు ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే బృందాలు ఇచ్చిన నివేదికతోపాటు, బీజేపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో ఖర్చు చేసే కేంద్ర నిధులకు తాత్కాలిక బ్రేకు పడినట్టు సమాచారం. ఉపాధి హామీ పథకంతోపాటు వివిధ పథకాలకు సంబంధించి గ్రామాల్లో జరిగే పనులకు గత 15 రోజుల నుంచి నిధులు నిలిచి పోయాయి. ప్రధానంగా రాష్ట్రం చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో ఉపాధి హామీ పథకం వాటా నిధులు ఆగిపోయాయి. ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో యూనిట్‌కు రూ.58 వేల చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు మిళితమై ఉన్నాయి. ఈ నిధుల విడుదల నిలిచిపోవడంతో ప్రస్తుతం గృహ నిర్మాణ పురోగతి కుంటుపడింది. బిల్లులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
కేంద్ర నిధులతో రాష్ట్రంలో జరుగుతోన్న పనులపై ఇటీవల కేంద్ర బృందం క్షేత్రస్థాయి లో సర్వేచేసి నివేదిక సమర్పించింది. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోందని ఈ బృందం గుర్తించిందని చెబుతున్నారు. కొన్ని పనులకు చంద్రబాబు పేరు పెట్టుకున్నట్టు కేంద్ర బృందాలు గుర్తించాయని సమాచారం. ఇందులో ప్రధానంగా చంద్రన్న బీమా పథకాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే ఆయా పనులపై అధికారులు కేంద్ర బృందానికి ఇచ్చిన వివరాలకు, పనులు జరుగుతున్నచోట స్థానికులు చెప్పిన విషయాలు విరుద్ధంగా ఉన్నాయని బృందం గుర్తించినట్టు సమాచారం. పూర్తయిన పనుల వద్ద ఈ బృందం ఆరా తీసినపుడు రాష్ట్ర నిధులతో పనులు జరిగాయని ప్రచారం జరుగుతోందని, దీన్ని బట్టి కేంద్రం నయాపైసా కూడా ఇవ్వలేదనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు తదితర వౌలిక సదుపాయాల పనులూ నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు ఎక్కడా యంత్రాలను వినియోగించకూడదు. ఉదాహరణకు
ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి సగం నిధులు ఉపాధి హామీ పథకం నుంచి విడుదలైతే, మిగిలిన సగం నిధులు పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విడుదలవుతాయి. ఈ రెండూ కేంద్రం నుంచి వచ్చేవే. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల్లో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర వౌలిక సదుపాయాలకు వినియోగించాల్సివుంది. కేంద్రం నుంచి ఈ నిధులు నేరుగా స్థానిక పంచాయతీ ఖాతాల్లోనే పడుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల అనుమతితో స్థానిక ప్రజా ప్రతినిధులు వీటిని వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్టు బృందం గుర్తించింది. కేంద్ర నిధులపై రాష్ట్రం పెత్తనం చెలాయిస్తోందని, పథకాలు కేంద్రానివైనా, పేరు మాత్రం రాష్ట్రానికే దక్కుతుందని కొంతమంది బీజేపీ నేతలూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు కేంద్ర బృందం సర్వే, మరో వైపు బీజేపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలోనే నిధులకు తాత్కాలిక బ్రేకుపడినట్టు సమాచారం
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉపాధి హామీ పథకం పనులు ముందుకు జరగాలంటే కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఫలానా కూలీ నుంచి తనకు పని కావాలన్నట్టు ముందుగా దరఖాస్తు తీసుకోవాలి. పనులు అంగీకరించినట్టు అధికారులు తీర్మానించాలి. పంచాయతీ స్థాయిలో పని తాలూకు అంశం చర్చించిన తీర్మానం ఉండాలి. పని అవసరమని సంబంధిత అధికారి నివేదిక ఇవ్వాలి. ఆయా పనులకు అంచనా వ్యయం, సంబంధిత పని పూర్తయ్యాక ఇన్ని రోజులు ఉపాధి పొందామనే కూలీల ధ్రువీకరణ పత్రాలతో పాటు వాటిని నిర్ధారించే మస్తర్లు ప్రతీ పనికీ ఉండాలని కొత్త మార్గదర్శకాల్లో నిర్దేశించారు. ఈ తాజా మార్గదర్శకాల ప్రకారం పనులు చేసి రాష్టవ్య్రాప్తంగా జిల్లాల వారీగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సివుంది. ఈ నివేదికతో సంతృప్తి చెందితే తప్ప వచ్చే ఏడాది ఉపాధి హామీ నిధులు వచ్చే దారిలేదు. ఇక కొత్తగా పనులు చేపట్టాలంటే కేంద్రం సూచించిన విధి విధానాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ మేరకు ఆగిపోయిన పనులకు కొత్త అనుమతుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.