రాష్ట్రీయం

వెనక్కి తగ్గిన జీ-గ్రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: అగ్రిగోల్డ్ కేసు వ్యవహారం సోమవారం నాడు మరో మలుపు తిరిగింది. ఆ కంపెనీతో పాటు అనుంబంధ సంస్థలన్నింటినీ టేకోవర్ చేస్తామంటూ గతంలో ముందుకు వచ్చిన జీ గ్రూప్ సంస్థ వెనక్కు తగ్గింది. కేవలం అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని సోమవారం నాడు హైకోర్టు విచారణ సందర్భంగా ప్రతిపాదన చేసింది. స్వాధీనం చేసుకోవడానికి మరో మూడు నెలల గడవుపొడిగించాలని కూడా కోరింది. అగ్రిగోల్డ్ సంస్థలను టేకోవర్ చేస్తామని చెప్పిన జీ గ్రూప్ మూడు నెలలుగా ఫైళ్లన్నింటినీ అధ్యయనం చేసింది. 10 కోట్ల రూపాయిల డిపాజిట్ సైతం చేసింది. అయితే తాము ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని కోర్టుకు తెలిపింది. ఆస్తులను అప్పగిస్తే మరో కంపెనీ వచ్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెబితే ఎలా అని కూడా జీ గ్రూప్ ప్రశ్నించింది. ఆ సంస్థ ప్రతిపాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆగ్రిగోల్డ్ బాధితులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
వైద్యుల నియామకానికి చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల నియామకానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ప్రభుత్వం సోమవారం నాడు హైకోర్టుకు తెలిపింది. మొత్తం 551 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. తొలి దశలో 129 పోస్టులను నింపేందుకు అనుమతి ఇచ్చామని పేర్కొంది. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎం గంగారావులతో కూడిన బెంచ్ ముందు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య హాజరై అఫిడవిట్ దాఖలు చేశారు.