రాష్ట్రీయం

లక్ష కొలువుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రాతిపదికగానే టీచర్సు రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సోమవారం పబ్లిక్ సర్వీసు కమిషన్, పాఠశాల విద్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, హైకోర్టు ఆదేశాలకు లోబడి పాత పది జిల్లాల ప్రాతిపదికపై నోటిఫికేషన్ ఇస్తున్నామని వెల్లడించారు.
కొంత మంది కావాలని ప్రతిదానికీ కోర్టుకు వెళ్తున్నారని, పది జిల్లాల ప్రాతిపదికపై నోటిఫికేషన్ ఇచ్చినా.. 31 జిల్లాల ప్రాతిపదికపై నోటిఫికేషన్ ఇచ్చినా.. ఎలా ఇచ్చినా కొంతమంది న్యాయస్థానం ఆశ్రయించాలని ఎదురుచూసినట్టు తమ వద్ద సమాచారం ఉందని వివరించారు. వచ్చే ఏడాది ఆగస్టులోగా 1,08,000 పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. త్వరలోనే పోస్టుల భర్తీకి క్యాలండర్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికే 29 వేల పోస్టుల భర్తీ చేశామని, ఈ ప్రకటనపై ఎలాంటి అనుమానాలున్నా తమవద్ద వివరాలు పొందవచ్చని ప్రకటించా రు. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని, ఆత్మహత్యలను తాను ఖండిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం అన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాడి గెలవాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భం గా విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలను ఏ ప్రభుత్వమూ ప్రోత్సహించదని, వాటిని పార్టీలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఓయు విద్యార్థి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ అతని చేతి రాతను సరిపోల్చి చూస్తే నకిలీయో, అసలో తెలుస్తుందని, ఆ పని ఎందుకు చేయడం లేదని అన్నారు. సిద్థాంత విబేధాలున్న వాళ్లంతా కలిసి పనిచేస్తున్నారంటే వారి వెనుక ప్రజలు లేరని తెలిసిపోతుందని కడియం అన్నారు. ప్రతిపక్షాలు భావ దారిద్య్రంలో ఉన్నాయని కడియం తీవ్రంగా విమర్శించారు.
జంబూద్వీపకండువా ఆవిష్కరణ
జంబూ ద్వీప కండువాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆలేరులోని మహా ఆది జాంభవ చక్రవర్తి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఆది జాంభవ చక్రవర్తి రాజముద్ర నేడు మనం వాడుతున్న స్వస్తిక్ చిహ్నం సృష్టికి మూలమని, ఆయన పాలనలో సమసమాజం వెల్లివిరిసిందని పేర్కొన్నారు. శక్తిశ్రీగురు భగవత్ మహా స్వామి ఆధ్వర్యంలో జాంభవ చక్రవర్తి ఆలయ నిర్మాణం జాంబవంతుడి సిద్థాంతాల కోసం ఎమ్మార్పీఎస్ నడుంబిగించిందని అన్నారు.
విధివిధానాలు విడుదల చేయండి
ప్రభుత్వం గతంలో చెప్పినట్టు 1.08 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికైనా విధివిధానాలను విడుదలచేయాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి క్యాలండర్ విడుదల చేయాలని అన్నారు. నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లనే యువతలో ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు.

చిత్రం..ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి