రాష్ట్రీయం

కేసీఆర్ ఇంటికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ‘స్వాతంత్య్ర తెలంగాణ కోసం మరో సంగ్రామం చేద్దాం. సిఎం కె. చంద్రశేఖర్ రావును ఇంటి బాట పట్టిద్దాం’ అని వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సరూర్‌నగర్ స్టేడియంలో ‘కొలువుల కొట్లాట’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేల సంఖ్యలో హాజరైన యువకులను ఉద్ధేశించి వక్తలు ఆవేశంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్రానే్న సాధించుకున్న మనకు కొలువులు సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని పిలుపునిచ్చారు.
సంకెళ్లు ఆపలేవు..: కోదండరామ్
టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ సభలో ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనను సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. నిరుద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వ ఆంక్షలు, సంకెళ్లు ఆపలేవన్నారు.
ఇకమీదట వౌనంగా ఉండొద్దు. సంఘర్షణ చేద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న మనకు కొలువులు తెచ్చుకోవడం కష్టమా? అని ప్రశ్నించారు. ఈ దశలో సభికులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఫిబ్రవరిలో నిరుద్యోగులతో ఇందిరా పార్కు వద్ద సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరితే, ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారని కోదండం గుర్తు చేశారు. తర్వాత
అక్టోబర్ 30న అడిగామని, మళ్లీ నవంబర్ 30న అడిగామన్నారు. దేనికీ అనుమతి లభించకపోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించాల్సి
వచ్చిందన్నారు. మందు, డాన్స్ కోసం ఇటీవల ‘సన్ బర్న్’ను అనుమతించారని ఎద్దేవా చేశారు. మనమేమైనా కుర్చీలు అడిగామా?, మంత్రి పదవులు అడిగామా? కేవలం కొలువులే కదా అడిగింది అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మంత్రులకే ముఖ్యమంత్రి దొరకరని, సచివాలయానికి అసలే రారని కోదండరామ్ దుయ్యబట్టారు.
నిర్బంధ తెలంగాణ: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నిర్బంధ తెలంగాణగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిస్టర్ కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరువు..’ అని హెచ్చరించారు. 1999లో కేసీఆర్‌కు మంత్రి కొలువు పోయినందుకే తెలంగాణ ఉద్యమం చేపట్టారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
మరో సంగ్రామం: రామచందర్ రావు
బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ సామాజిక స్వాతంత్య్ర తెలంగాణ సాధనకు మరో సంగ్రామం చేపట్టాల్సి ఉందన్నారు. పోలీసులు పాలకులకు తొత్తుల్లా వ్యవహారిస్తున్నారని విమర్శించారు.
ఇక విశ్రమించరాదు: ఎల్ రమణ
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుర్చీ నుంచి లాగేంత వరకూ విశ్రమించరాదని పిలుపునిచ్చారు. తెరాస అధికారం చేపట్టిన 42 నెలల్లో 72 నోటిఫికేషన్లు ఇచ్చి చివరకు 16 వేల ఖాళీలను భర్తీ చేసిందని విమర్శించారు. కుటుంబ పాలన కొనసాగుతున్నదని, అవినీతి, అక్రమాలు పెచ్చుపెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగిగా చేయాలి: చాడ
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను రాజకీయ నిరుద్యోగిగా మార్చాలన్నారు. త్యాగాలు మనవి, అధికారం ఆయనకా? అని అని చాడ ప్రశ్నించారు. నాడు సకల జనుల సమ్మె తరహాలో జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఏకమై కేసీఆర్‌ను ఇంటి బాట పట్టిద్దామని పిలుపునిచ్చారు. నియంతృత్వ, అవినీతి పాలనపై ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.
రాజకీయ శక్తిగా ఎదగాలి: గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. తీన్‌మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రగతి భవన్‌లో సిఎం పరేషాన్‌లో ఉన్నారని అనగానే సభికులు కరతాళధ్వనులు చేశారు. విమలక్క మాట్లాడుతూ కొట్లాటను మరింత ఉధృతం చేద్దామని, అంతిమ విజయం మనదేనన్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, అడ్వకేట్ రచన, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రజా తెలంగాణ పార్టీ నాయకుడు ఇన్నయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రవి కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సంధ్య ప్రభృతులు ప్రసంగించారు.

చిత్రం..సరూర్‌నగర్‌లో నిర్వహించిన కొలువుల కొట్లాట
బహిరంగ సభలో మాట్లాడుతున్న టేజేఏసీ చైర్మన్ కోదండరామ్