రాష్ట్రీయం

అదిరిపోవాలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో సాహిత్యం, సంగీత విభావరితోపాటు ఆహార ప్రదర్శన, ఫుడ్ కోర్టులు, పుస్తక ప్రదర్శన, విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శన, పురావస్తుశాఖ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహకులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం లోపల, వెలుపల అలంకరణలు, సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతిభవన్‌లో సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌తో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని సీఎం నియమించారు. సాంస్కృతి శాఖ మంత్రి చందూలాల్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీతో పాటు ఇతర
సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధాన వేదిక వద్ద ప్రతీ రోజు సాయంత్రం సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రవీంద్రభారతి, మినీ హాలు, ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, ఎల్‌బి ఇండోర్ స్టేడియంలో సాహిత్య సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి, ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి పర్యటన ఖరారు అయిందన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఎల్‌బి స్టేడియంలోనే జరగుతాయన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీతద విధావరి నిర్వహించాలని సూచించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింభించేలా డాక్యుమెంటరీని రూపొందించాలన్నారు. సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు, అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎల్‌బి స్టేడియాన్ని సందర్శించారు. ఎక్కడెక్కడా ఏవిధమైన ఏర్పాట్లు చేయాలో అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసారు.

చిత్రం..ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల
ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్