రాష్ట్రీయం

ఉద్యోగం బెంగతో విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంటాల, డిసెంబర్ 4: ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన బొద్దోల్ల భీమేష్ (35) బీఈడీ చేశాడు. కుటుంబ భారం తనపై ఉండడంతో ఉద్యోగం వస్తుందో లేదోనన్న బెంగతో ఆదివారం ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై యూనుస్ పేర్కొన్నారు. మృతుడి అన్న గత నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో కుటుంబ పోషణ భీమేష్‌పై పడింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఉరి వేసుకుని మృతి చెందినట్లు వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.