రాష్ట్రీయం

మిషన్ కాకతీయ నాలుగవ దశలో 5703 చెరువులు పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: మిషన్ కాకతీయ నాలుగవ దశ కింద 5703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులోగా పాలనాపరమైన అనుమతులు పొంది జనవరి మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ 4వ దశపై సచివాలయం నుంచి జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. నాలుగవ దశలో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందజేయడం వల్ల పూడిక మట్టిని రైతులు వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. పూడిక మట్టికి భూసార పరీక్షలు నిర్వహించి ఏ నేలలకు వినియోగించుకోవాలో రైతులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. గతంలో కేవలం 9 భూసార పరీక్ష కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు ఒకటి చొప్పున ఉందన్నారు. ఇకపై పది రోజులకోసారి మిషన్ కాకతీయపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. వివిధ కారణాల వల్ల గతంలో తిరస్కరించిన పనులను తిరిగి పంపించే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి హెచ్చరించారు. నాలుగవ దశలో చేపట్టే పనులపై ప్రతిపాదనలు ఈ నెల 15కల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు పంపించాలని మంత్రి ఆదేశించారు. పాలనా అనుమతుల జారీ ప్రక్రియను నెలాఖరుకల్లా పూర్తి చేసి టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు.

చిత్రం.. మిషన్ కాకతీయ 4వ దశపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు