రాష్ట్రీయం

భళా.. కౌశిక్ కళాప్రతిభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ డిసెంబర్ 6: అకుంటిత దీక్ష... అధ్యాపకుల తర్ఫీదు.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. లక్ష్యసాధనలో అలుపెరగని ప్రయత్నం.. కలగలిపి ఒక బాలుడిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దరిచేరేలా చేసింది. జనగణమన గేయంతో దేశ భక్తిని పెంపొందించే క్రమంలో మరెందరికో స్ఫూర్తినిచ్చేలా.. కౌశిక్ తన కళా ప్రతిభతో కందిపప్పు గింజలతో జనగణమన గీతాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతాన్ని తలపించింది. అలసటను పక్కనపెట్టి నిర్విరామంగా పది గంటలపాటు శ్రమించి చివరకు విజయం సాధించాడు.
విజయవాడ నగరంలోని మారుతీనగర్‌లో నివాసముంటున్న ఇమ్మరశెట్టి విశ్వనాథ శ్రీనివాస్ కుమారుడు కౌశిక్ స్థానిక నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుండి సృజనాత్మకతను ప్రదర్శించే కౌశిక్ ఏదైనా వినూత్నంగా ప్రయత్నించాలని చివరకు జనగణమన గీతాన్ని వినూత్నంగా రాయాలని తలచాడు. ఇప్పటి వరకు కందిపప్పుతో జనగణమన గీతాన్ని ఎవరూ ప్రదర్శించలేదని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నానికి పదునుపెట్టాడు. ఇదేక్రమంలో సుమారు ఏడాదిపాటు మైక్రో కార్వింగ్ ద్వారా కందిపప్పు గింజలను అక్షరాలుగా చెక్కి జనగణమన గీతాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. చివరకు పూర్తిస్థాయిలో నేర్చుకున్న తరువాత చివరగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం బుధవారం సాహసించాడు. దీనిలో భాగంగా బుధవారం తన గృహంలో ఉదయం 10.30 గంటల నుండి కందిపప్పు గింజలతో జనగణమన గీతాన్ని చెక్కటం ప్రారంభించి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతానికి పూర్తి గీతాన్ని చెక్కి అందరినీ అబ్బుర పరిచాడు. జనగణమన గీతంలోని మొత్తం 288 అక్షరాలను కందిపప్పు గింజలపై ఒక పదునైన బ్లేడ్ సహాయంతో సుందరంగా చెక్కి తీర్చిదిద్దాడు.
ఈక్రమంలో ఎటువంటి అలసట, వైద్య పరమైన చిక్కులు వచ్చినా సత్వరం వైద్యం అందించేందుకు వైద్యుడి పర్యవేక్షణలో రికార్డును నెలకొల్పాడు. అక్షరాలు చెక్కిన తీరు బాలుడి సంవత్సరాల కృషిని ప్రతిబింబించింది. కౌశిక్ ప్రయత్నాన్ని ఆద్యంతం జ్యూరీ మెంబర్ల పర్యవేక్షణలో పూర్తిగా రికార్డ్ చేశారు. కౌశిక్ చేసిన ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి పంపిస్తున్నామని, రెండురోజుల్లో వారి నుండి ప్రతి స్పందన వస్తుందని, కౌశిక్‌కు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు శివ ‘ఆంధ్రభూమి’కి వివరించారు.
ఇప్పటి వరకు ఇటువంటి ప్రయత్నం ఎక్కడా ఎప్పుడూ చేయలేదని, తమ కుమారుడి ప్రయత్నం తప్పకుండా రికార్డ్స్‌లో నమోదు అవుతోందని కౌశిక్ తండ్రి శ్రీనివాస్ తెలిపారు. విషయం తెలుసుకున్న తెదేపా యువనేత దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నగరానికి చెందిన ప్రముఖులు కౌశిక్‌ను కలిసి అభినందించారు. కార్వింగ్‌లో కౌశిక్‌కు తర్ఫీదునిచ్చిన గురువు శివ, పిల్లాడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు పలువురు అభినందనలు తెలిపారు.