రాష్ట్రీయం

ఐదుగురు నక్సల్స్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 6: మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా ప్రాణహిత నదీ తీరంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలూకా ఇంగనూర్‌కల్హాడి అటవీ ప్రాంతంలో పీపుల్స్
లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ) ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు సి-60 స్పెషల్ ఫోర్స్ కమాండో దళాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపటాయ. గడ్చిరోలి గోండియా నక్సల్స్ ఆపరేషన్ విభాగం డీఐజీ అంకూష్ షిండే వివరాల ప్రకారం ప్రాణహిత అటవీ ప్రాంతాలను స్థావరంగా మలచుకుని కొంతకాలంగా మావోయిస్టులు విధ్వంస, హింసాత్మక ఘటనలతో ఉనికి చాటుతున్నారు. నక్సల్స్ సంస్మరణ వారోత్సవాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్లీనరీని ఛేదించారు. సిరోంచ తాలూకా ఇంగనూర్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల సమాచారం నేపథ్యంలో సి-60 పోలీసు బెటాలియన్ రంగంలోకి దిగి గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపిన ఘటనలో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళా నక్సల్స్ మృతదేహాలను పోలీసులు గుర్తించడం గమనార్హం. సంఘటన స్థలాన్ని సాయంత్రం మహారాష్ట్ర ఐజీ చెల్లార్, గడ్చిరోలి ఎస్పీ అభినయ్ దేశ్‌ముఖ్, సిరోంచ ఎస్‌డీపీవో గజానంద్ రాథోడ్ సందర్శించి, మృతదేహాలను హైరి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు విప్లవ సాహిత్యం లభించినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి నుండి ప్రాణహిత నదీతీరం అవతలివైపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం అలజడి రేపింది. ఎన్‌కౌంటర్ మృతులను ఇంకా గుర్తించలేదు.
ఉత్తర తెలంగాణలో హై అలర్ట్
సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ సంఘటన తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసింది. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో నక్సల్స్ ప్రతికార చర్యలకు పాల్పడే ఆస్కారం ఉందని భావించి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సరిహద్దు రహదారులపై తనిఖీలు ముమ్మరం చేసి నిఘా పెంచారు. ప్రాణహిత, పెన్‌గంగా నదీ శివారుల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీలు, ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు గావించారు. మావోయిస్టులు ప్రాజెక్టులను అడ్డుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగి నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, అదనపు ఎస్పీ మోహన్ రెడ్డి మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చెనాకకోర్ట బ్యారేజీ వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచామని, జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు.