రాష్ట్రీయం

బహుమతులకు 14వ్యాసాల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన రాష్టస్థ్రాయి పరిశోధనా వ్యాసరచన పోటీల ఫలితాలను ప్రకటించారు. ఈ పోటీల కోసం వ్యాసాలను ఆహ్వానించి, నవంబర్ 30 తేదీలోగా వ్యాసాలను పంపించాలంటూ గడువుగా నిర్ణయించారు. గడువులోగా 130 పరిశోధనా వ్యాసాలు రాగా, వీటిని ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య వెల్దండ నిత్యానందరావు, తెలుగువిశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ గుమ్నన్నగారి బాల శ్రీనివాసమూర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలకు చెందిన డాక్టర్ ఎస్. రఘులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయానికి ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ ఆమోదం లభించింది. ఉత్తమంగా ఎంపికైన వ్యాసరచయితలకు బహుమతులు ఇవ్వాలని ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమై తీర్మానించారు. ప్రథమ బహుమతి వరంగల్‌కు చెందిన బాసని సురేష్‌కు, ద్వితీయ బహుమతి కరీంనగర్‌కు చెందిన విఎల్ రాఘవరావుకు, తృతీయ బహుమతి మహబూబ్‌నగర్‌కు చెందిన బడుగుల వనితకు లభించాయి. ప్రోత్సాహక బహుమతులకు సూర్యాపేటకు చెందిన కొల్లు మధుసూదనరావు, కరీంనగర్‌కు చెందిన డాక్టర్ మలయశ్రీ, ఖమ్మంకు చెందిన డాక్టర్ నూనావత్ రాంబాబు, పగిడిపల్లి రాజారావు, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఆచార్య ఫణీంద్ర, డాక్టర్ ఎస్. విజయభాస్కర్, నల్లగొండకు చెందిన నర్రా ప్రవీణ్‌రెడ్డి, సిద్ధిపేటకు చెందిన నక్క హరికృష్ణ, దాసరి శాంతకుమారి, వరంగల్‌కు చెందిన ఓరుగంటి ఎల్లయ్య ఎంపికయ్యారు. ప్రత్యేక ప్రోత్సాహక బహుమతికి నిజామాబాద్‌కు చెందిన కె. రసజ్ఞ ఎంపికయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వీరికి బహుమతులు అందిస్తారు. ఈ వ్యాసాలతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాలని కోర్ కమిటీ నిర్ణయించింది.