రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచనతో ముందుకు పోతున్నామని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగిస్తూ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలకు దూరమవుతున్నాడన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి దీటుగా రాష్ట్రంలో తమ పార్టీకి ప్రజల నుండి మరింత ఆదరణ లభిస్తుందన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ గెలుపు ఖాయమన్నారు. అదే తరహాలో కర్ణాటకలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్థితిగతులు తెలుసుకుంటూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, అసెంబ్లీల వారీగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుకూల వాతావరణంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రైతుపోరు, సమరభేరి, ఆదివాసీ గిరిజనుల గర్జన, నిరుద్యోగ శంఖారావం లాంటి కార్యక్రమాలతో ఉద్యమబాట పట్టామన్నారు. ప్రజాపోరు పేరుతో ప్రజలను మరింత చైతన్యపరుస్తున్నామన్నారు. పల్లె నుండి పార్లమెంటు వరకు అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని 17పార్లమెంటు సీట్లు గెలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఆయన మండిపడ్డారు. ముస్లింల రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం కాదా అన్నారు. ఆదివాసీల డిమాండ్ చట్టబద్దమైనదిగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్, నాయకులు భరత్‌గౌడ్, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్