రాష్ట్రీయం

పవన్‌పై విమర్శలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత, సీనీనటుడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని తెలుగుదేశం నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తోందన్నారు. ప్రాజెక్టుపై అభూతకల్పనలు ప్రచారం చేస్తే సహేతుకంగా, నిజాయితీగా సమాధానం చెప్పాలని పోలవరం ప్రాజెక్టుపై విశాఖపట్నం నుంచి శుక్రవారం ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పవన్ సానుకూలంగా అర్థం చేసుకుంటున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శిస్తున్నా, సంయమనం పాటించాలని సూచించారు. పవన్‌పై వైకాపా చేస్తున్న విమర్శలను వాళ్లే చూసుకుంటాని, మనకెందుకు అంటూ వ్యాఖ్యానించారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ
చేయని ప్రయత్నం లేదు.. అయినా అన్ని సమస్యలు అధిగమించి రైతుల మన్ననలు, ఆశీర్వాదాలు పొందగలిగామన్నారు. పోలవరం పూర్తయితే ప్రతిపక్ష వైకాపా మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, అందుకే అవాస్తవాలు, అబద్ధాలను ఆ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి తీరతామని పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలి పని చేస్తామని సందేశాలు పంపుతున్న రైతన్నలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతన్నల స్ఫూర్తి, ప్రోత్సాహమే ప్రభుత్వ బలమని, పోలవరం పూర్తిచేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చి కొన్ని మండలాలను రాష్ట్రంలో కలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. రాష్ట్రానికి జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం పనులు త్వరితగతిన పూర్తిచేయడానికి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారమంతా ఇప్పటికే అందజేశామని, మళ్లీ అడిగినా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ ముందు ఉంచామన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్దిష్ట సమయానికి పూర్తిచేసి రాష్ట్ర అభివృద్ధి, రైతుల హితం, నీటి భద్రతను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పోలవరంపై అసెంబ్లీ ముందు ఉంచిన వివరణ శే్వతపత్రం కన్నా ఎక్కువని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పూర్తికావడమే మాకు ముఖ్యం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఎవరు సహకరించినా సంతోషంగా స్వీకరిస్తామని తెలిపారు.