రాష్ట్రీయం

అమ్మాయిలను చదివించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 8: అమ్మాయిలను చదివించడం పవిత్ర కార్యమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. వేదకాలం నుంచి మహిళలకు ప్రాముఖ్యత ఉందన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన వెంకయ్య మాట్లాడుతూ అమ్మాయిలను చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచిస్తూ, తనకు చిన్న పిల్లలన్నా , పాఠశాలలన్నా ఎనలేని అభిమానమన్నారు. ప్రధాని, తానూ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీధి బడుల్లోనే చదువుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్థికంగా ఎదిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ పాఠశాలలకు తమవంతు చేయూతనివ్వాలన్నారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను ఎప్పటికీ మరువరాదన్నారు. చదువు నేర్పిన గురువును మరువరాదన్నారు. చిన్నప్పుడు చదివిని పాఠశాలను సైతం మరువకూడదని తరగతి తరగనినిధి అని వెంకయ్యనాయుడు అన్నారు. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. అమ్మభాష కళ్లులాంటిదని, పరభాష కళ్లద్దాలాంటివని వివరించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కన్నతల్లి, ఉన్న ఊరును మరువకూడదన్నారు. ఈ పాఠశాల వందళ్లనాటిది అంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ప్రస్తుత సమాజంలో పరభాషా సంస్కృతి ఎక్కువగా ఉందన్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం, మాట్లాడటం తప్పుకాదన్నారు. ప్రస్తుతం సమాజంలో కులం, మతం, ధనం ప్రాముఖ్యత వహిస్తున్నాయన్నారు. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు మంచి ప్రవర్తన, క్రమశిక్షణ అలవర్చుకుని ముందుకెళ్లాలని సూచించారు. గుణం, బుద్ది, ప్రతిభ, విశాలదృక్పథం, సామాజిక స్పృహ, ఐక్యమత్యం, ఆత్మాభిమానం కలిగివున్నపుడే జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు పయనించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరు తాము చదువుకున్న చదువు, విద్యాబుద్దులను సామాజికహితం కోసమే వినియోగించాలన్నారు. ముఖ్యంగా యువతీయువకులు విద్యలో రాణించినప్పుడే దేశం పురోగాభివృద్ధి సాధిస్తుందన్నారు. భారతదేశ పురాణాలు, ఇతిహాసాలను తరిచిచూచినపుడు ఎన్నో సంప్రదాయాలు కన్పిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు భారతదేశ గౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా కాకుండా సమాజం గురించి
ఆలోచించినప్పుడే ప్రతి మనిషి పరిణితి సాధించగలడన్నారు. అప్పుడే దేశం గర్వపడేలా ప్రతి ఒక్కరు ఒక శక్తిలా తయారయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం ఉద్యోగం కోసమే చదువుకోవాలనే ధ్యాసమాని నైతిక విలువలు, న్యాయం, చేతివృత్తులు తదితర అంశాలకు కూడా విలువవిచ్చే విధంగా విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చ్భారత్ , బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల నుంచి వైదొలిగానని, రాజ్యాంగ పదవి చేపట్టినందున తాను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదని అన్నారు. అయితే ప్రజాజీవనం నుంచి ప్రజాసేవనుంచి మాత్రం వైదొలగలేదని స్పష్టం చేశారు. తాను ఉప రాష్టప్రతిగా ఎన్నికై 110 రోజులు అవుతోందని, అప్పుడే దేశంలోని 23 రాష్ట్రాల్లో పర్యటించానన్నారు. ప్రజలకు అవసరమైన చట్టాలు చేసేందుకే ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు. కులం, ధనం, మతాలకు ప్రాధాన్యత ఇస్తే రాజకీయాల్లో మనుగడ సాధించలేరన్నారు. దేశభక్తి,క్రమశిక్షణ అంకితభావం ఉంటే పదవులు అవంతుకు అవే దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సి.ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ రఘురామిరెడ్డి, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజలురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అనిబిసెంట్ మున్సిపల్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాల్లో మాట్లాడుతున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు