రాష్ట్రీయం

తగ్గిన అవినీతి కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: దేశ వ్యాప్తంగా అవినీతినిరోధక శాఖ, విజిలెన్స్ శాఖలు నమోదు చేస్తున్న కేసుల నమోదు 2015తో పోల్చితే 2016లో గణనీయంగా తగ్గాయి. దేశంలో 2016లో 4400 కేసులు, 2015లో 5191 కేసులు, 2014లో 4888 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 1016 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, ఒడిశా రాష్ట్రంలో 569 కేసులు, కేరళ 430 కేసులు, మధ్యప్రదేశ్‌లో 402 కేసులు నమోదయాయ్యాయి. తెలంగాణలో 89 కేసులు, ఆంధ్ర రాష్ట్రంలో 164 కేసులు వివిధ అవినీతి అభియోగాల కింద ప్రభుత్వ ఉద్యోగులపై 2016లో నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2014లో ఆంధ్రాలో 174 కేసులు, తెలంగాణలో139 కేసులు, 2015లో ఆంధ్రాలో 185 కేసులు, తెలంగాణలో 193 కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లోని అవినీతి నిరోధక శాఖలు అంతకు ముందు నమోదైన కేసులతో కలుపుకుని 2016లో 7564 కేసులను దర్యాప్తు చేశాయి. 2016లో నమోదైన కేసులు కలుపుకుంటే 11964 కేసులను వివిధ రాష్ట్రాల్లోని అవినీతినిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 295 కేసులు, ఆంధ్రాలో 448 కేసులు 2016లో వివిధ దశల్లో దర్యాప్తుల్లో ఉన్నాయి. మహారాష్టల్రో రికార్డు స్ధాయిలో 2009 కేసులు, రాజస్తాన్‌లో 1889 కేసులు, ఒడిశాలో 1325 కేసులు దర్యాప్తులో ఉన్నాయని ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. సరైన ఆధారాలు లేక, ఇతర సాంకేతిక కారణాల వల్ల కేసులను మూసివేసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్ధానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మూసివేసిన కేసులు 2016లో 125, ఆంధ్రాలో 80 , రాజస్తాన్‌లో 89 ఉన్నాయి.
రాజస్తాన్ రెండవ స్ధానంలో, ఆంధ్రా మూడవ స్థానంలో కేసుల మూసివేత కేటగిరీలో నిలిచాయి. కాగా 2016లో అవినీతి కేసులకు సంబంధించి వివిధ కోర్టుల్లో 7816 కేసుల్లో చార్జిషీట్లు నమోదు చేశారు. దేశం మొత్తం మీద మహారాష్టల్రో 987 కేసుల్లో, మధ్యప్రదేశ్‌లో 415 కేసుల్లో చార్జిషీట్లు అత్యధికంగా దాఖలయ్యాయి. తెలంగాణలో114 కేసుల్లో, ఆంధ్రాలో 148 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. దేశం మొత్తం మీద కోర్టుల్లో 25414 కేసులు విచారణలో ఉన్నాయి. కాగా వివిధ రాష్ట్రాల్లో కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను విశే్లషిస్తే మహారాష్టల్రో 4883 కేసులు, ఒడిశాలో 3842 కేసులు, రాజస్తాన్‌లో 380 కేసులు, కర్నాటకలో 1833 కేసులు, గుజరాత్‌లో 1592 కేసులు, బీహార్‌లో 1480 కేసులు విచారణలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 805 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 1382 కేసులను కోర్టులు కొట్టివేశాయి. తెలంగాణలో 22 కేసుల్లో, ఆంధ్రాలో 37 కేసుల్లో, మధ్యప్రదేశ్‌లో 137 కేసులు, ఒడిశాలో 83 కేసులు, కర్నాటకలో 70 కేసుల్లో అవినీతి ఉద్యోగులకు శిక్షలను కోర్టులు ఖరారు చేశాయి. అవినీతి అభియోగాలపై 2016లో దేశ వ్యాప్తంగాగ 5447 మందిని అరెస్టు చేశారు. ఇందులో తెలంగాణలో 101 మంది, ఆంధ్రాలో 168 మంది ఉద్యోగులు, మహారాష్టల్రో 1320 మంది, ఒడిశాలో 1090 మంది ఉద్యోగులు అరెస్టయ్యారు.