రాష్ట్రీయం

రహదారి రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, డిసెంబర్ 9: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద శనివారం టిప్పర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో భార్యా భర్తలు సహా నలుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండలం బెండపూడి నుండి జగ్గంపేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు ఆటోలో వెళ్తుండగా కత్తిపూడి సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో తిరుగుతున్న దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థకు చెందిన టిప్పరు పక్కనే చెరువులో నుండి జాతీయ రహదారిపైకి వస్తూ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీను (35), అతని భార్య నాగలక్ష్మి (32), మాచర్ల లోవ (49), బుద్ధా చంద్రశేఖర్ (42)లు మృతి చెందారు. ఆటోడ్రైవర్ శ్రీను, భార్య నాగలక్ష్మి సంఘటనా స్థలంలో మృతి చెందగా మరో
ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఆసుపత్రికి తరలించగా వారిలో మాచర్ల లోవ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి నుండి మెరుగైన చికిత్సకోసం నలుగురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బుద్ధా చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురు క్షతగాత్రులు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న బెండపూడి గ్రామస్థులు వందలాదిమంది ఘటన ప్రాంతానికి చేరుకుని విగతజీవులైన తమ బంధువులను చూసి రోధించారు. అన్నవరం ఎస్సై పార్థసారథి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
హైవే విస్తరణ గుత్తేదారు కంపెనీపై స్థానికుల ఆగ్రహం
216వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న దిలీప్ బిల్డ్‌కాన్ సంస్ధ పనులు చేపట్టే ప్రాంతంలో ఎటువంటి హెచ్చరికల బోర్డునుగాని, వేగం నిరోధక చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమని మృతుల బంధువులతోపాటు, పలువురు వాహనచోదకులు కంపెనీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి న్యాయం చేయాలని మృతుల బంధువులు ఆందోళన చేపట్టడంతో హైవే విస్తరణ కంపెనీ దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థ ప్రతినిధులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతుల బంధువులతో చర్చించి మృతుల బంధువులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీనితో మృతుల బంధువులు ఆందోళన విరమించారు.

చిత్రం..శ్రీను, నాగలక్ష్మిల మృతదేహాలు