రాష్ట్రీయం

గేమింగ్ అడ్డా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: గేమింగ్ రంగానికి హైదరాబాద్ ప్రపంచస్థాయి సౌకర్యం కలిగిన కేంద్రంగా రూపుదిద్దుకోనుందని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు అన్నారు. గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించి తద్వారా భారీగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఇమేజ్) టవర్‌కు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఎన్‌విడియా నిర్వహించిన ‘గేమర్ కనెక్ట్ 2017’ ప్రదర్శన ఐదో వెర్షన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఆధునాతన పీసీ గేమింగ్ టెక్నాలజీతో పాటు భారతీయ గేమింగ్ కమ్యూనిటీ పట్ల ఆసక్తి ఉన్న వారి అభిరుచికి అనుగుణంగా, గేమింగ్‌లో కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో గేమర్ కనెక్ట్ 2017ను ఎన్‌విడియా నిర్వహిస్తోంది. గతంలో ఈ కార్యక్రమాన్ని కోల్‌కత్తా, అహ్మదాబాద్, కొచ్చి, లక్నోల్లో నిర్వహించగా ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు ఎన్‌విడియా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇప్పటికే గేమింగ్ రంగానికి సంబంధించి 100 యానిమేషన్, గేమింగ్ కంపెనీలు, 2డి, 3డి స్టూడియోలు పని చేస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గేమింగ్ రంగం అభివృద్ధితో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కోకొల్లలుగా పెరుగుతాయని అన్నారు. ఎన్‌విడియా, డెల్, ఎల్జీ, జొడాక్ వంటి గేమింగ్ పరిశ్రమలు తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపడం సంతోషించదగిన విషయమని అన్నారు. ఎన్‌విడియా సౌత్ ఏషియా మేనేజింగ్ డైరక్టర్ విశాల్ ధూపర్ మాట్లాడుతూ గత మూడేళ్లలో దాదాపు 20 నగరాల్లో 150 కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్‌లో కూడా గేమింగ్ రంగం విపరీతంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు సంస్థలు తమ వద్ద ఉన్న గేమింగ్ కార్యకలాపాలను సందర్శకుల కోసం ప్రదర్శించాయి.

చిత్రం..‘గేమర్ కనెక్ట్ 2017’ ఐదో వెర్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్