రాష్ట్రీయం

బాబు మాట నీటి మూట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, డిసెంబర్ 10 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఆదివారం అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక వాటిని విస్మరించి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో చంద్రబాబు అడిగారన్నారు. టీడీపీ
అధికారం చేపట్టి నాలుగేళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయని, దీంతో నిరుపేదలు ఆ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, లేనిపక్షంలో భృతి కింద రూ. 2వేలు ఇస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 45 నెలలు అవుతుందని, దీంతో ప్రతి కుటుంబానికి రూ. 90వేలు బాకీ పడ్డారన్నారు. ఇక బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణం పొందిన రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, కాని ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం బంగారం వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు చేనేతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో బీసీలు, చేనేతలతో వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతూ మోసం చేస్తున్నాడన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేస్తున్నానన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనేక పక్కాగృహాలు నిర్మించారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలను చదివించడానికి ప్రతి చిన్నారికి ఏడాదికి రూ. 15వేలు ఇస్తామన్నారు. 45 సంవత్సరాలకే పింఛను అందజేస్తామని, అది కూడా రూ. 2వేలు అందజేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం వైఎస్ పనులు చేపట్టారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం డిస్ట్రిబ్యూటరీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేదని, కనీసం ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేదన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన వేరుశెనగ, పత్తికి గిట్టుబాటు ధర లభించడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు పక్కాగృహం కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి కనీసం ఏడుగురికి ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కూడేరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్