రాష్ట్రీయం

గడ్కరీ వచ్చాకే ప్రాజెక్టుపై ముందుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాతే ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలకమై అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం, కొత్త టెండర్లు..వంటి అంశాలపై కేంద్ర మంత్రి పర్యటన తరువాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులతో విజయవాడలో ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం కొత్త టెండర్లు, పెరిగిన ధరలు, ధరల్లో మార్పు వల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయం, తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 22న కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. గడ్కరీ పర్యటన తరువాత కీలక అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు, కాంక్రీటు పనులు వేగవంతం చేయటం గురించి చర్చించారు. త్రిసభ్య కమిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా విలేఖరులతో మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందని, వాటిపై చర్చించామని తెలిపారు. గడ్కరీ పర్యటన తరువాత మరింత స్పష్టత వస్తుందన్నారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని, 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి ఉమా స్పష్టం చేశారు.