రాష్ట్రీయం

పీఏసీలు.. గప్‌చుప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం కొనసాగుతోన్న సహకార సంఘాల పదవీ కాలం నెలలో ముగియనున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో గడువులోగా సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనట్టుగానే ఉంది. సహకార సంఘాల పాలక వర్గాలకు ఫిబ్రవరి 4తో పదవీకాలం ముగిసిపోతుంది. గడువు ముగియక ముందే తాజాగా ఎన్నికల నిర్వహించడానికి సాంకేతికపరమైన చిక్కులు నెలకొన్నాయి. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లు (డీసీసీబీ) ఏర్పాటు కావాల్సి ఉంది. జిల్లాల విభజన జరగడంతో ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న 9 డీసీసీబీల స్థానంలో (హైదరాబాద్ మినహాయించి) 30 జిల్లాలకు డీసీసీబీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. డీసీసీబీల ఏర్పాటుకు ముందు కొత్త జిల్లాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలి. ప్రాథమిక సహకార సంఘాలలో సభ్యులుగా ఉండే రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం, వాటిని ఆధార్ కార్డులతో సీడింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన వారు మొదట డైరెక్టర్లను ఎన్నుకోవాలి. డైరెక్టర్లంతా కలిసి డీసీసీబీ చైర్మర్లను ఎన్నుకోవాలి. తర్వాత డీసీసీబీ చైర్మన్లంతా కలిసి తెలంగాణ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ (టాస్‌కాబ్) చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే మొదట ప్రాథమిక సహకార సంఘాలకు ఓటర్ల జాబితా ఖరారు కావాలి. జాబితాలో ఓటర్లుగా ఉండాలంటే ప్రస్తుతం సభ్యులు తమ సభ్యత్వాలను రెన్యూవల్ చేసుకోవాలి. ప్రస్తుత సభ్యుల రెన్యూవల్ కానీ, ఓటర్ల జాబితాను కానీ ఇప్పటి వరకు ఖరారు కాకపోవడంతో కేవలం నెల రోజులలో (్ఫబ్రవరి 4) పదవీ కాలం ముగియనున్న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనట్టేనని అధికార వర్గాల సమాచారం. వాస్తవానికి సహకార శాఖ సకాలంలోనే ఎన్నికలు నిర్వహించడానికి సహకార ఎన్నికల ఆథారిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి రెండు నెలల కిందటే నివేదిక పంపించింది. దీనిని ప్రభుత్వం ఆమోదించి ప్రతిపాదించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తే తప్ప తాజాగా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల వారీగా డీసీసీబీల ఏర్పాటు కాకపోవడం వల్లనే ప్రభుత్వం సహకార ఎన్నికల ఆథారిటీని ఆమోదించకపోవడానికి కారణమని సమాచారం. మరోవైపు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని ఆమోదించడానికి ప్రత్యేకంగా శాసనసభను సమావేశ పర్చబోతుంది. పంచాయతీరాజ్ చట్టంలో సంస్కరణలు తీసుకొచ్చినట్టే సహకార చట్టంలో కూడా సంస్కరణలు తీసుకవచ్చే అవకాశం లేకపోలేదు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చాక కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశాకనే ఎన్నికలు నిర్వహించనుంది.
పంచాయతీల ఎన్నికల్లో భాగంగా కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని ఏర్పాటు చేశాక డీసీసీబీలను కూడా అదే తరహాలో ఏర్పాటు చేసిన తర్వాతనే సహకార ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో ప్రస్తుత కార్యదర్శులను పర్సన్ ఇంచార్జిలుగా కొత్త పాలకవర్గాలు ఎన్నికయ్యేవరకు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.