రాష్ట్రీయం

కొత్త వ్యూహం కలిసొచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. తెరాస వ్యతిరేక శక్తులను కూడదీసి బలోపేతమయ్యే దిశగా అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలున్న వాతావరణం కనిపిస్తుండటంతో, వాటివల్ల ఓటు బ్యాకు చీలిపోకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఒకవైపు టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండ రామ్, మరోవైపు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదన్న గుబులు నేతల్లో కనిపిస్తున్నది. విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా ఎన్నికలకు ముందు వ్యవహారాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాలపై సీనియర్లు దృష్టి పెడుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలపై రాజకీయ విశే్లషకులు ఆలోచన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలతో కూడా నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని, కొత్తగా పార్టీలేవీ ఆవిర్భావం జరగకుండా ఉంటే బాగుంటుందని నేతల భావన. సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో ‘్ఢ’ అంటే ‘్ఢ’ అనేలా ముఖా ముఖి పోటీ ఉంటేనే తమకు భవిష్యత్తు ఉంటుంది తప్ప, టి.జెఎసి, బీసీ సంక్షేమ సంఘం కొత్తగా పార్టీలను ప్రారంభిస్తే నష్టం వాటిల్లుతుందని టి.కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. టిఆర్‌ఎస్‌కు నష్టం ఉండదా? అంటే టిఆర్‌ఎస్ కంటే ఎక్కువ నష్టం తమకే జరుగుతుందన్న భయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోవడమో,
విలీనం చేయించుకోవాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నది.
ఇలాఉండగా శనివారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు గాంధీ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ ‘కేసీఆర్‌కు హఠావో... తెలంగాణకో బచావో’ అనే నినాదం లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయ పునరేకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పునరేకీకరణ ఎలా సాధ్యమవుతుందన్న భావన రాజకీయ విశే్లషకుల్లో లేకపోలేదు. మిత్రపక్షాలైన టిడిపి-బిజెపిని పక్కన పెడితే కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కాగా ప్రొఫెసర్ కోదండరామ్‌పై రాజకీయ పార్టీని స్థాపించాలన్న వత్తిడి ఉంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యపైనా పార్టీని స్థాపించాల్సిందిగా బిసిల నుంచి, ఇతర వర్గాల నుంచి వత్తిడి ఉంది. వీరిరువురూ కొత్తగా పార్టీలను స్థాపిస్తే, తమకే నష్టం జరుగుతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీని స్థాపిస్తే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నది. కాంగ్రెస్‌లో అనాదిగా రెడ్డి సామాజికవర్గం అధిపత్యం ఉంది. ఆ వర్గానికి ఎక్కువగా గుర్తింపు ఆ పార్టీలోనే ఉందన్న భావన ప్రజల్లో ఉంది. ప్రొఫెసర్ కోదండరామ్ ఆ ఓటు బ్యాంకుకు చిల్లు కొడతారన్న భయం వారిలో నెలకొంది. మరోవైపు బిసిల్లో బలమైన నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్. కృష్ణయ్య బిసిల సంక్షేమం పేరిట ఏదైనా పార్టీ స్థాపిస్తే ఆ వర్గం ఓట్లూ నష్టపోతామని కాంగ్రెస్ నేతల అంఛనా. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నాయకులు వేర్వేరు పార్టీలు స్థాపించకుండా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
బీజేపీ ఆలోచన కూడా...
ఇలాఉండగా బిసి నాయకుడైన ఆర్.కృష్ణయ్యతో ఇటీవల బిజెపి మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఒకరు మంతనాలు జరిపినట్లు సమాచారం. బిజెపిలో చేరాల్సిందిగా ఆమె ఆయన్ను కోరారు. తమ పార్టీలో చేరితే తగిన విధంగా గుర్తింపు లభిస్తుందని, బిసిలకు న్యాయం జరుగుతుందని, కేంద్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బిజెపినే అధికారంలోకి వస్తుందని ఆమె వివరించారు. అందుకు కృష్ణయ్య ప్రతిస్పందిస్తూ బిసిల అభ్యున్నతే లక్ష్యంగా తన పోరాటం సాగుతున్నందున ఏమీ చెప్పలేనని అన్నట్లు తెలిసింది. ఇలా కృష్ణయ్య కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.