రాష్ట్రీయం

చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆదివారం కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బిసి సంక్షేమ సంఘం నాయకులు చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు అవసరమైన విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించేలా కేంద్రంపై వత్తిడి తేవాలని కోరారు. అదేవిధంగా బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలని, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం తరహాలో బిసిల సామాజిక రక్షణ, భద్రత కల్పించేందుకు బిసి చట్టాన్ని తీసుకుని రావాలని, ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని, అందుకే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆర్. కృష్ణయ్య కోరారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్ కృష్ణయ్య