రాష్ట్రీయం

మెట్రో రైలుకు థాలెస్ సిగ్నలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది. మొదటి కారిడార్‌లో మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు 13 కి.మీ, మూడవ కారిడార్‌లో అమీర్‌పేట నుంచి నాగోల్ వరకు 17 కి.మీ దూరం కలిపి మొత్తం 30 కి.మీ దూరం మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని మోది, సిఎం కెసిఆర్ గత నెల 28న జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. అత్యంత భద్రతతో కూడిన ఆటో సిగ్నలింగ్ వ్యవస్థను థాలెస్ ఏర్పాటు చేసింది. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (సిబిటిసి), ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ సూపర్‌విజన్ (ఐసిఎస్) వ్యవస్థలను కలిగిన సిగ్నలింగ్ వ్యవస్థను తొలిసారి భారత దేశంలో అందించేందుకు థాలెస్‌ను మెట్రోరైల్ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి నియమించింది. సిబిసిటిసి సిగ్నలింగ్‌కు అదనంగా థాలెస్ తన సమగ్రమైన ఐసిఎస్ ప్యాకేజ్‌ను కూడా అందించింది. ఈ ప్యాకేజ్‌లో డేటా ప్రసారం, ప్రయాణీకుల ప్రకటనలు, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, దోషాలను తెలియజేసే సౌకర్యాలు, ఆఫీస్ ఆటోమేషన్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సిసిటివి, యాక్సెస్ కంట్రోల్, మాస్టర్ క్లాక్, టెలిఫోనీ, వాయిస్ రికార్డింగ్, రేడియో వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ ఏర్పాటుతో మెట్రో రైలు రవాణా వ్యవస్థ స్వరూపానే్న మార్చివేసింది. మెట్రో రైల్ నిర్మించిన ఎల్‌అండ్‌టి థాలెస్ యొక్క అత్యాధునిక సిగ్నలింగ్‌ను ఎంచుకుంది.