రాష్ట్రీయం

అందరూ ఆహ్వానితులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంఅగా నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సభలకు దేశ విదేశాల నుంచి 8 వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. నేరుగా, ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ప్రతినిధుల సంఖ్య సోమవారానికి 8 వేలకు చేరుకుంది. హాజరయ్యే ప్రతినిధులు పాల్గొనే వేదికలు, సౌకర్యాలను స్వయంగా వారితో మాట్లాడి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సభలకు జిల్లాలనుంచి హాజరయ్యే తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులకు రవాణా, భోజన సౌకర్యాలను సంబంధిత కలక్టర్లు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, హాజరయ్యే ప్రతినిధులను తగిన విధంగా గౌరవించాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహకులకు సూచించారు. గుర్తింపు పొందిన 13 భారతీయ భాషల్లో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలని కూడా సీఎం సూచించారు. ప్రగతి భవన్‌లో సోమవారం ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కమిటీలతో సీఎం కేసీఆర్ నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి ఏర్పాట్లపై దిశ నిర్దేశం చేశారు. మహాసభల ప్రారంభ, ముగింపు రెండు ప్రధాన ఘట్టాలు నిర్ణయాత్మకంగా, నిర్ణీతంగా ఉండాలని, ఇది బహుముఖ కార్యక్రమం కావడంతో ఎక్కడా లోటు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మహాసభల ప్రారంభిస్తున్నట్టు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రకటించే సమయంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చేలా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో
నిర్ణయించారు. ప్రారంభ, ముగింపు రెండు ప్రధానమైన వేదికలు ఎల్బీ స్టేడియంతోపాటు ఇతర వేదికల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వాహకుల్లో ఒక్కోక్కరు తీసుకోవాలని నిర్ణయించారు. సభలకు వచ్చే ప్రతినిధులు ప్రతీ ఒక్కరితో నేరుగా మాట్లాడి వారి అభిలాష మేరకు వసతి సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు. అలాగే భోజనాలు, బస, రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులు వేదికల వద్దకు చేరుకోవడానికి వాహనాలు సమకూర్చాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌లను ముందుగానే గుర్తించాలని సూచించారు. మహాసభల్లో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పేలా ఉండాలని సీఎం సూచించారు. సభలు జరిగే ఐదు రోజుల్లో ఒకరోజు ప్రత్యేకంగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు, రాష్ట్ర ప్రతినిధులకు, సన్మాన గ్రిహీతలకు, మహిళలకు, మంత్రులు, మీడియాకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.