రాష్ట్రీయం

ఇంకెన్నాళ్లకు డిజైన్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: అమరావతి నగరంలో నూతన నిర్మాణ ఆకృతుల పరిశీలన, కసరత్తు, చర్చలతోనే సమయం వృథా అవుతోంది. గత రెండేళ్ల నుంచి జరుగుతున్న చర్చలు, పర్యటనలన్నీ ఆకృతుల పరిశీలనకే సరిపోవడంతో కాలహననం అవుతోంది తప్ప, ఆ దిశగా ఒక్క అడుగు ముందుకుపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున, ఆలోగా కనీసం రెండు మూడు బిల్డింగులు పూర్తి చేయకపోతే అమరావతిపై రాజకీయంగా కూడా దెబ్బతింటామన్న ఆందోళన అటు పార్టీ ఎమ్మెల్యేల్లోనూ వ్యక్తమవుతోంది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన శాసనసభ, హైకోర్టులను ఐకానిక్ బిల్డింగులుగా నిర్మించాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దానికోసం లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లపై చర్చలు జరిపారు. మళ్లీ అక్కడికి సీఎం సహా మంత్రులు, సినీ దర్శకుడు రాజవౌళి కూడా వెళ్లి నార్మన్ ఫోస్టర్‌తో చర్చలు జరిపారు. ఆక్రమంలో అక్టోబర్‌లో అసెంబ్లీకి రెండు డిజైన్లు ప్రదర్శించింది. అయితే దానిపై బాబు అంతగా సంతృప్తి చెందకుండా, వాటిని మరింత అభివృద్ధి చేసి ఇవ్వాలని కోరారు. వారితో చర్చించి సూచనలు ఇచ్చే బాధ్యతలను రాజవౌళికి అప్పగించారు. అయితే, ఆకృతుల విషయంలో సీఎం చంద్రబాబు ఒక పట్టాన సంతృప్తి చెందకపోవడం, తరచూ ఆలోచనలు మార్చుకోవడం, మెరుగైన ఆలోచన వచ్చినప్పుడల్లా వాటిపై సూచనలు ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలన్నీ ఆకృతులలో ప్రతిబింబించాలని షరతు విధించడం, దానికి బాహుబలి దర్శకుడు రాజవౌళి సూచనలు తీసుకోవడం, ఆయన సహా మంత్రులు, అధికారుల బృందం లండన్‌కు వెళ్లడం, పర్యటనలు, పరిశీలనలు, మళ్లీ వాటిపై చర్చలతోనే సగం సమయం సరిపోయిందంటున్నారు. అసెంబ్లీ భవనం పగలు సూర్యకాంతిలో మెరిసిపోవాలని, రాత్రివేళ వెనె్నల వెలుగులతో నిండిపోవాలని, చుట్టూ కొలను ఏర్పాటుచేసి, నీటి నీడలో అసెంబ్లీ కనిపించాలని సీఎం చంద్రబాబు
నార్మన్‌ఫోస్టర్‌కు సూచించారు.
అయితే, బాబు మాత్రం ప్రతి సీఆర్‌డీఏ సమావేశంలో రాజధాని నిర్మాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా, చరిత్రలో నిలిచిపోవాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొద్దిగా ఆలస్యమైనా ఫర్వాలేదని, నిర్మాణం మాత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. దీనితో అసలు డిజైన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియ పూర్తి చేయకుండా తామేమి చేయగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ భవనం కోసం నార్మన్‌ఫోస్టర్-రాజవౌళి కలసి రూపొందించిన డిజన్లపై చంద్రబాబు వద్ద సమావేశం జరగనుంది. దానిపై తిరిగి 14, 15న గేట్‌వే హోటల్‌లో సీఆర్‌డీఏ ఒక కీలక సమావేశం నిర్వహించనుంది. అందులో అందరి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఖరారైన డిజైన్లను ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. నేటి సమావేశంలోనయినా డిజైన్లు ఓ కొలిక్కి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
కాగా, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం వల్ల, పార్టీ రాజకీయంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎన్నికల్లోగా కనీసం రెండు టవర్లు, కొన్ని భవనాలు పూర్తి చేస్తేనే, మిగిలినవి కూడా చంద్రబాబునాయుడు మాత్రమే పూర్తి చేస్తారన్న నమ్మకం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇవేమీ చేయకుండా డిజైన్లతో సమయం వృథా చేసి, తీరా ఎన్నికల ముందు వరకూ నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయకపోతే, అమరావతి నగర నిర్మాణాలపై ఇప్పటివరకూ తాము ఇచ్చిన ప్రకటనలు, చేసిన భూ సమీకరణ అంతా వృథానేనన్న భావన పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.