రాష్ట్రీయం

రైతుకు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: వ్యవసాయానికి నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం ఇక ఆటో స్టార్టర్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆటో స్టార్టర్ల వల్ల మేలుకంటే కీడే ఎక్కువ జరగడం వల్ల రైతులు స్వచ్చందంగా వాటిని తొలగించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఆటో స్టార్టర్ల వల్ల కలిగే నష్టంపై రైతులకు అవగాహన కల్పించడానికి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రగతి భవన్‌లో మంగళవారం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, ఆటో స్టార్టర్ల తొలగింపు అంశాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆటో స్టార్టర్లను తొలగించుకుంటేనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల లాభం కలుగుతుందని, లేనట్టుయితే భూగర్భ జలాలు అడుగంటుకుపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వ్యవసాయానికి ఎలాగు 24 గంటల విద్యుత్ ఇవ్వనుండటంతో రైతులు తమంతకు తాము నష్టపరుచుకోరన్న నమ్మకం తనకుందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల కలిగే లాభ నష్టాలు, ఎదురయ్యే సవాళ్లపై అధికారులతో సీఎం చర్చించారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితిలో రైతులు ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. విద్యుత్ ఎప్పుడొచ్చినా మోటర్లు ఆటోమేటిక్‌గా స్టార్ట్ కావడానికి ఏర్పాటు చేసుకున్నారన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట చేతికొచ్చేసరికి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసినా రైతులకు ప్రయోజనం ఉండదని అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ 24 గంటల విద్యుత్ వల్ల రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగాలంటే ఆటో స్టార్టర్లను తొలగించుకోవడమే ఉత్తమమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 24 గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల కలిగే భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌కయ్యే వ్యయాన్ని వచ్చే బడ్జెట్‌లోనే చేరుస్తామన్నారు. అలాగే విద్యుత్ సబ్సిడీలకు ఇచ్చే వ్యయాన్ని అదనంగా నిధులు కేటాయిస్తామన్నారు. విద్యుత్ శాఖ చేసే వ్యయంలో కేవలం 9 శాతం మాత్రమే ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు అవుతుందన్నారు. వచ్చే ఏడాదిలో పూర్తి కానున్న ఎత్తిపోతల పథకాలకు అయ్యే విద్యుత్ చార్జీల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు.