రాష్ట్రీయం

లక్షణంగా స్వచ్ఛత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు 44 లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసిన జీహెచ్‌ఎంసీకి క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ప్రజలను ఆకర్షితులను చేసేందుకు నగదు బహుమతులను అందజేస్తోంది. ఇందులో భాగంగా ఇంట్లోనే చెత్తను తడి, పొడిగా వేర్వేరు చేసి అందించే వారిని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తమ ఇళ్లలోని చెత్తను ఇంట్లోనే వేరు చేసి రెండు బిన్లలో ఆటో కార్మికుడికి అందించి, ఆ వివరాల్ని, ఫొటోలను అప్‌లోడ్ చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన హిమాయత్‌నగర్‌కు చెందిన గనసాల ముత్యాలుకు రూ.లక్ష నగదు బహుమతిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అందజేశారు. అంతేగాక, దోమల నివారణపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రూపకల్పన చేసిన మస్కిటో యాప్‌లోని 16 ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలిచ్చిన వారిలో పది మందిని లాటరీ ద్వారా విజేతలుగా ఎంపిక చేసి వారికి ఒక్కోక్కరికి రూ. పదివేలు చొప్పున నగదు బహుమతిని కూడా మంత్రి అందజేశారు.
నెలకు రూ. 50 చెల్లించాల్సిందే!
ఇంట్లోనే చెత్తను తడి, పొడిగా వేరు చేసి అందించటంతో పాటు ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లిస్తున్నా అదనంగా చెత్త కోసం నెలకు రూ. 50 చెల్లించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారాన్ని చేపట్టింది. సాధారణంగా ఇళ్లలో పోగయ్యే చెత్తను కవర్లలో వేసి, వాటిని రోడ్లపై పారవేయటం, నాలాల్లో వేయటం వంటివి చేస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రజారోగ్యానికి, మరో రకంగా పర్యావరణానికి ఎంతో ముప్పు కల్గిస్తోంది. ఇలా కాకుండా జీహెచ్‌ఎంసీ ఇచ్చిన రెండు బిన్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇంటికొచ్చే కార్మికుడికి ఇస్తే చాలు. అంతేగాక, చెత్తను వేరు చేయటంలో గృహిణులు, యజమానులు కాస్త బాధ్యతాయుతంగా ఉండాలని, స్వీయ నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతో ఆటో కార్మికుడికి నెలకు రూ. 50 చెల్లించాలని నిర్ణయించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
చిత్రం..మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతిని స్వీకరిస్తున్న విజేత