రాష్ట్రీయం

ఎల్-1 దర్శనాలు దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 12: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎల్-1 దర్శనం ఒక వ్యాపారంగా మారిందని, ప్రముఖులకే కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నా అర్హతలేనివారు ఎల్-1 దర్శనాలు చేసుకుంటున్నారని నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు ఆరోపించారు. మంగళవారం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఎల్-1 అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. తాను పాత్రికేయులకు కూడా చెప్పేది ఒకటేనని, ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై రాయగలిగితే రాయండి, లేకుంటే తన ముందు మైకులు పెట్టి తనపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించవద్దని కోరారు. తనచేత మాట్లాడించడం అటు తరువాత టీడీపీ నాయకులు వస్తే తిట్టించడం తగదన్నారు. తానీరోజు ఎల్-1 దర్శనంలో వెళ్లానని అక్కడ ఎందరో అనర్హులను చూశానన్నారు. అలాగే వితవుట్ వెయిట్ అనే పేరుతో మరికొంతమంది తమకు కావాల్సిన వారిని ప్రముఖులతో కలిపి ఆలయంలోకి అనుమతిస్తున్నారని చెప్పారు. ఇక తిరుమలలో ఆలయం ముందు మాట్లాడవద్దని టీటీడీ విజిలెన్స్ అధికారులు తనకు చెబుతున్నారన్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమలలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించడానికి పనిచేయాలే తప్ప తమలాంటి వారిని మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించడానికి కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు.