రాష్ట్రీయం

ఆంధ్రాలో స్థానికత కోసం ఆసక్తి చూపించని ఏపి ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి కదలాలంటే స్థానికత ఇవ్వాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన ఉద్యోగులు ఈ రోజు స్థానికత హోదాకు ఆసక్తికనపరచడం లేదు. 2015లో ఇక్కడి నుంచి ఏపి సచివాలయాన్ని అమరావతికి తరలించిన విషయం విదితమే. ఆ సమయంలో దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కాని తమను బదిలీ చేయడం వల్ల తమ పిల్లలకు స్థానికత హోదా ఉండదని, దీని వల్ల ఇంజనీరింగ్, వైద్య, న్యాయ, పిజి, డిగ్రీ కోర్సుల్లో సీట్ల కేటాయింపులో, అలాగే పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు చంద్రబాబు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చాయి. ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం రాష్టప్రతి ఉత్తర్వుల్లో మార్పులుచేసి అమరావతికి వచ్చే ఉద్యోగులకు స్థానికత హోదా కల్పించారు. రెండేళ్ల తర్వాత పరిశీలిస్తే మొత్తం ఆరువేల మంది ఉద్యోగుల్లో 2186 మంది ఉద్యోగులు మాత్రమే స్థానికతకు దరఖాస్తు చేశారు. ఇందులో 1800 మందికి స్థానికత హోదా లభించింది. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం ఆరువేల మంది ఉద్యోగుల్లో 70 శాతం మంది ఉద్యోగులు స్థానికత హోదా కోసం దరఖాస్తు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం ఒక పెద్ద సమస్యగా మారిన ఈ అంశంపై అప్పట్లో ప్రభుత్వం సవాలుగా తీసుకుని కేంద్రంతో పోరాడి స్థానికత హోదాను సాధించింది. ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగినా ఇంకా 371 డి ఆర్టికల్, జోన్ల అంశం కొనసాగుతూనే ఉంది. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏ ప్రాంతంలో ఎక్కువ సంవత్సరాలు ఉండి అక్కడ విద్యను పూర్తి చేసి ఆ స్థానికత వస్తుంది. ఏపిలో నాలుగు జోన్లు, తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయి. చాలా మంది ఏపి ఉద్యోగులు స్థానికత కోసం దరఖాస్తు చేయకపోవడానికి కారణం, వారి పిల్లలు విద్యాభ్యాసం పూర్తి కావడం, లేదా ఇప్పటికే ఇంజనీరింగ్ , వైద్య కళాశాలల్లో, ఇతర వృత్తి విద్యల్లో చేరి ఉండడం లేదా తెలంగాణ స్థానికత హోదా కలిగి ఉండడం వల్ల ఏపి స్థానికత కోసం ఏపి ఉద్యోగులు దరఖాస్తు చేసి ఉండకపోవచ్చని తెలుస్తోంది. పైగాచాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ అమరావతికి బదిలీ అయినా, హైదరాబాద్‌లోనే కుటుంబాలు ఉన్నాయి. ఈ ఉద్యోగులు ప్రతి వారం హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇది కూడా స్ధానికత కోసం దరఖాస్తు చేయకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు.