రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 12: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి పర్వదినాలతోపాటు నూతన ఆంగ్ల సంవత్సరం 2018, జనవరి 1న తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, పోలీస్, ఆర్టీసీ అధికారులతో ఆయన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ పర్వదినాలను పురస్కరించుకుని ఈనెల 28 నుంచి 1వ తేదీ వరకు ఆర్జిత సేవలను, కాలినడకన వచ్చే భక్తులకు అందించే దివ్యదర్శనం టోకన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకునే భక్తులను ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తామన్నారు. కంపార్టుమెంట్లు నిండిన తరువాత వచ్చే భక్తులను ఆళ్వార్ ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2, కర్ణాటక సత్రాలు, మేదరమిట్ట, ఉత్తర మాడవీధి పైభాగాన, బాట గంగమ్మగుడి వద్ద ఉన్న రింగురోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలోకి అనుమతిస్తామన్నారు. ఈనెల 29 వైకుంఠ ఏకాదశి పర్వదినాన శుక్రవారం కావడంతో అభిషేకం, ధనుర్మాస పూజలు కారణంగా భక్తులకు సర్వదర్శనం సమయం 4 గంటలపాటు తగ్గిందన్నారు. ఉదయం 5.30 గంటలకు అత్యంత ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శన ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభించి నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈనెల 28న క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులు 24 గంటలపాటు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. అయితే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అల్పాహార, అన్నప్రసాదాలు, తాగునీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. పలుచోట్ల తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేసి, భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రముఖుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారికి, ఇతర ప్రముఖుల వసతి, దర్శన ఏర్పాట్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఇందులో భాగంగా మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాలో సీనియర్ జ్యుడిషియల్ అధికారులకు వెంకటకళానిలయంలో, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపిలకు రామరాజు నిలయం, సీతా నిలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక అఖిల భారత సర్వీసుల్లో ఉన్నవారికి సన్నిధానం అతిధి భవనంలోను ఇతర అధికార ప్రముఖులకు గంబుల్ విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారు స్వయంగా వస్తే వారితోపాటు ఐదుగురికి అదే రీతిలో ప్రజాప్రతినిధులు, ఇతర ఐఏఎస్ అధికారులు స్వయంగా వస్తే ముగ్గురికి మాత్రమే వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు.