రాష్ట్రీయం

మీవల్లే పోలవరం సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి గందరగోళంగా తయారైందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు విమర్శించారు. రామచందర్‌రావు తన నిరసనను లేఖ రూపంలో బాబుకు పంపారు. ‘కేంద్రం అనుమతి లేకుండా ప్రాజెక్టు అంచనాలను మీ ఇష్టానుసారం పెంచేయడం వల్లే పోలవరం గదరగోళంలో పడిపోయింది’ అని ఆయన దుయ్యబట్టారు. జనసేనతోసహా అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేశాయని, ఎలాంటి తప్పిదం లేకపోతే పోలవరంపై శే్వతపత్రాన్ని ఎందుకు విడుదల చేయటం లేదని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, రాష్ట్రంపై పడే భారం ఎంత అని కేవీపీ ఆ లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ ఓకటో తేదీ నాటి రేట్ల ప్రకారమే నిధులు ఇస్తామంటూ పెట్టిన షరతుకు ఎందుకు ఒప్పుకోవల్సి వచ్చిందని కేవీపీ నిలదీశారు. ‘పోలవరంపై శే్వతపత్రం ఇచ్చేందుకు మీరు నిరాకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది’అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా భరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపి ఉన్నత న్యాయ స్థానంలో తాను దాఖలు చేసిన పిల్‌పై కోర్టు ఇచ్చిన నోటీసులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ ఇప్పటి వరకు ఎందుకు దాఖలు చేయలేది ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తాము చేసిన చట్టాన్ని తామే ఉల్లంఘిస్తుంటే చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, పైగా కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నారని కేవీపీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘మీరు మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు వెనుకాడటం లేదు’ అని కాంగ్రెస్ నేత ధ్వజమెత్తారు. ‘మీరు పోలవరం నిధుల కోసం అధికారులను వెంటేసుకుని నాగపూర్, ఢిల్లీకి తరచూ పరుగులెత్తటం మానుకోండి. ప్రాజెక్టు నిర్మాణం, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో కౌంటర్ దాఖలు చేయండి’ అని సలహా ఇచ్చారు.