రాష్ట్రీయం

రోబో సర్జరీ సూపర్ హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 13: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యశోద ఆసుపత్రిలో రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు అత్యాధునిక సాంకేతిక పద్ధతిలో శస్త్ర చికిత్సలు నిర్వహించి పునఃర్జన్మ ప్రసాదించారు యశోద వైద్యులు. మానవుని జీవన విధానంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఒత్తిడికి గురౌతున్న వారు మూత్రపిండాల వ్యాధుల భారిన పడుతున్నారు. శరీరం మొత్తం సరఫరా అవుతున్న రక్తాన్ని శుద్ధిచేసే మూత్రపిండాలు పాడవడంతో డయాలసిస్ చేయాల్సివస్తుంది. వ్యాధి మరీ ముదిరితే ట్రాన్స్‌ప్లాంట్ తప్ప మరో మార్గం లేదు. సాధారణ కిడ్నీ మార్పిడి చేసే సమయంలో రోగి, దాత శరీరంపై భారీగాయాన్ని చేయాల్సి రావడం, ఇతర సమస్యలు తలెత్తేవి. ఆపరేషన్ నిర్వహించడం వైద్యులకు సవాలుగా ఉండేది. కీడ్నీ సేకరించే సమయం ఆలస్యం వంటి కారణాలతో ఒక్కోసారి శస్త్ర చికిత్సలూ విఫలమయ్యేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ విధానంలో దాత శరీరం నుంచి కిడ్నీ సేకరణ, రోగికి అమరిక ప్రక్రియ త్వరతగతిన పూర్తవుతుండటంతో
శస్తచ్రికిత్స విజయవంతమయ్యే అవకాశాలు రెట్టింపు అయ్యాయని వైద్యులు సూరిబాబు, ఉర్మిళా ఆనంద్ తెలిపారు. బుధవారం యశోద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోబోటిక్ శస్తచ్రికిత్స పద్ధతిని వివరించారు. ఈ పద్ధతిలో దాతకు చిన్నపాటి రంద్రాన్ని చేసి అతి సూక్ష్మమైన కేబుల్స్ గుండా కిడ్నీని సేకరించి, అదేస్థాయి రంద్రంద్వారా రోగికి కిడ్నీ అమర్చే వీలుంటుంది. దీంతో రోగి, దాతలు త్వరగా కోల్కొని తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు దేశంలోని కేవలం కొద్ది నగరాలకే పరిమితమైన రోబోటిక్ చికిత్సను, నగరంలో విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నగరానికి చెందిన మొబైల్ షాపు యజమాని కె రాజు (35), చత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్‌కుమార్ కుర్రే (38)లకు అక్టోబర్‌లో వారి కుటుంబీకుల నుంచి సేకరించిన కిడ్నీలను రోబిటిక్ పద్ధతిలో అమర్చారు. అదేవిధంగా మేనేజ్‌మెంట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోన్న మరో రోగికి అక్టోబర్ చివరివారంలో ఈ చికిత్స నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్నారు.