రాష్ట్రీయం

తెల్లవారి వెలుగులా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ తెలుగు మహా సభలకు ఏర్పాట్లు పూర్తి 5రోజులు.. 6 వేదికలు.. వంద సదస్సులు
వివిధ దశల్లో 200 పుస్తకాల ఆవిష్కరణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, కోర్ కమిటీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వెల్లడించారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో, భారీఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 15 నుండి ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల కోసం ఆరు వేదికలు ఏర్పాటు చేశామని, 100 సదస్సులు జరుగుతాయన్నారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా రోజూ సాయంత్రం 5 నుండి కార్యక్రమాలు ప్రారంభమై 9.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ సమయంలో మిగతా ఐదు వేదికల వద్ద ఎలాంటి కార్యక్రమాలు ఉండబోవన్నారు. తెలుగు వర్శిటీలోని ఎన్‌టిఆర్ కళాప్రాంగణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి ప్రధాన హాలు, రవీంద్రభారతి మినీ హాలు, తెలంగాణ సారస్వత పరిషత్తు హాలును వేదికలుగా ఉపయోగిస్తున్నామన్నారు. ఎల్బీ స్టేడియం వినా మిగతా వేదికల వద్ద కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదారు గంటలకు ముగుస్తాయన్నారు. ప్రతినిధులు తమ అభీష్టం మేరకు ఏ వేదికలో జరిగే సమావేశాలకైనా హాజరయ్యే అవకాశం ఉంటదన్నారు. సభల్లో పాల్గొనేందుకు 40 దేశాల నుండి 500 మంది ప్రతినిధులు వస్తున్నారని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారని, మన రాష్ట్రం నుండి ఆరువేల మంది పాల్గొంటున్నారని సిధారెడ్డి తెలిపారు. ప్రతినిధుల కోసం దాదాపు ఆరువేలకుపైగా గదులు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే ప్రతినిధులు మినహా మిగతా అందరికీ వసతి సౌకర్యం ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రతినిధుల రాక ప్రారంభమైందన్నారు. ప్రతినిధులకు ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సదరు హోటల్‌లోనే ఏర్పాటు చేశామని, మధ్యాహ్న భోజనం మాత్రం కార్యక్రమాలు జరిగే వేదికల వద్దే ఏర్పాటు చేశామన్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్న భోజనం ఉండదని, మిగతా ఐదు వేదికల వద్ద మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందన్నారు. అధికారికంగా ప్రతినిధిగా రిజిస్టర్ అయినవారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని, మిగతావారికి ఎల్బీ స్టేడియం వెలుపల ఏర్పాటు చేసే 60 ఆహార స్టాళ్లలో భోజనం తక్కువ ధరకు అందచేస్తున్నామన్నారు. ప్రతినిధులు బస చేసే హోటళ్ల నుండి సమావేశాలు జరిగే వేదికలకు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించామని వివరించారు. ప్రతినిధులకు డిసెంబర్ 14న రవీంద్రభారతిలో కిట్లు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని సిధారెడ్డి తెలిపారు. పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారికే కిట్లను అందిస్తామన్నారు.
సభలకు 100మంది వివిఐపిలు, 500మంది విఐపిలు హాజరవుతున్నారని, పత్రికా ప్రతినిధులు, ఇతర అధికారులు కూడా హాజరవుతారన్నారు. సామాన్య ప్రజలూ సభలకు హాజరు కావచ్చని, వీరికి ఎలాంటి ఫీజు ఉండబోదన్నారు. తొలిరోజు జరిగే ప్రారంభ సమావేశానికి హారజయ్యే వాళ్లు సాయంత్రం 4.30 గంటల వరకే వేదిక వద్దకు చేరుకోవాలని, జాప్యం జరిగితే సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సిధారెడ్డి తెలిపారు. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు హాజరవుతుండటం వల్ల భద్రతా చర్యల దృష్ట్యా ఎవరూ ఇబ్బంది పడవద్దన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ప్రజలు, ప్రతినిధుల సౌకర్యం కోసం తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభల సందర్భంగా 200 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నామని, ఒకేసారి కాకుండా, వేర్వేరు సదస్సుల సందర్భంగా వీటిని దశలవారీగా ఆవిష్కరిస్తామన్నారు.