రాష్ట్రీయం

ఏపి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: కడప జిల్లా అబ్బవరం గ్రామంలో కొన్ని పట్టా భూములను అసైన్డ్భూముల జాబితాలో కలుపుతూ నిర్లక్ష్యంగా ఆదేశాలు జారీ చేయడంపై హైకోర్టు ఏపి రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శికి పదివేల రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కె హరినాథ బాబు అనే వ్యక్తి సర్వే నెంబర్ 480లోని తన భూములను ప్రొహిబిటరీ లిస్టులో కలిపారని, అంతకు ముందు ఈ సర్వే నంబర్ ఈ జాబితాలో లేదని 2011లో ప్రభుత్వం పేర్కొన్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. తనకు చెందిన ఏడు ఎకరాల భూమి అసైన్డ్ భూములని, అందుకే రిజిస్టర్ చేయబోమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పి సుభాష్ వాదనలు వినిపిస్తూ ఈ భూములు 1942లో అసైన్డ్ చేశారని, కాని 1954 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు రిజిస్ట్రేషన్‌పైన నిషేధం వర్తించదని కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు జిల్లాకలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులకు కోర్టు ధిక్కారం కింద కేసును ఎందుకు నమోదు చేయరాదని కోర్టు ప్రశ్నించింది.