రాష్ట్రీయం

సీపీకి మిగిలింది మూడు దళాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 14: నాలుగు నెలల క్రితం తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్తగా ఏర్పాటైన జనశక్తి సీపీ బాట నక్సల్స్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుఝామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్‌నగర్ గంగారం గ్రామాల సమీపంలో ఉన్న మామిడిపల్లి అటవీ ప్రాంతంలో పోలీస్ తూటాలకు సీపీ గ్రూప్‌కు చెందిన ఎనిమిది మంది నక్సలైట్లు మృత్యువాతకు గురయ్యారు. దీంతో ఒక దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టయింది. జిల్లాలోని మణుగూరుకు చెందిన జనశక్తి సీనియర్ నేత జగ్గన్న నేతృత్వంలో నాలుగు నెలల క్రితం గుండాల అడవుల్లో కొత్తగా సీపీ బాట పేరుతో నక్సల్స్ పార్టీని ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు నాలుగు దళాలు ఏర్పాటైనట్లుగా సమాచారం. ఒక్కో దళంలో ఆరు నుండి ఎనిమిది మందిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తాజా సంఘటనలో ఒక దళానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నక్సల్స్ దళాలు చెల్లాచెదురైనట్లుగా తెలుస్తోంది. వీరంతా ఏటూరునాగారం, పినపాక, పాల్వంచ, గుండాల, పాకాల కొత్తగూడెం తదితర అటవీ ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించారు. నక్సల్స్‌ను అణచివేసేందుకు పోలీసులు చేపట్టిన కూంబింగ్ వల్ల గత కొద్దిరోజులుగా సీపీ గ్రూప్ నక్సల్స్ దళాల మధ్య సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసు కూంబింగ్‌ను ఎదుర్కొని కార్యకలాపాలను కొనసాగించే క్రమంలో టేకులపల్లి అడవుల్లో సంచరిస్తున్న దళం.. పోలీసులకు చిక్కడం, కాల్పుల్లో మరణించిన సంఘటనతో ఆ పార్టీకి చెందిన ఇతర దళాలు, నాయకులు రహస్య ప్రాంతాలకు తరలి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ ఆవిర్భావం నుంచి 4దళాలు పనిచేస్తున్నాయని తెలుస్తుండగా అందులో ఒక దళం మొత్తం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. దీంతో పార్టీ అధినేత జగ్గన్నతో పాటు మూడు దళాలు మాత్రమే మిగిలినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. దళాల చేతుల్లో మరికొన్ని ఆయుధాలు ఉండొచ్చని విప్లవ పార్టీల నేతలు భావిస్తున్నారు. పార్టీ ఏర్పాటు అనంతరం గ్రామాలలో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కరపత్రాలు పంచారు. పలుచోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దళ సభ్యులపై పలు రకాల కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. తెలంగాణలోని ఏజన్సీ ప్రాంతాల్లో కొత్త నక్సల్స్ పార్టీని విస్తరింపజేసేందుకు చేపట్టిన చర్యలకు నాలుగు నెలల కాలంలోనే భద్రాద్రి జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఈ ఘటనతో ఇతర దళాల ఉనికి కష్టసాధ్యమేనని తెలుస్తోంది. పార్టీ అధినేత జగ్గన్న మరో ముగ్గురు కీలక నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. మొత్తంమీద జనశక్తి సీపీ బాట నక్సల్స్ పార్టీకి గట్టిదెబ్బ తగలడం వలన దాదాపుగా పార్టీ ఉనికి కోల్పోయినట్లుగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.